తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు..

Bukka Sumabala   | Asianet News
Published : Dec 29, 2020, 10:42 AM IST
తెలంగాణలో కొత్తగా 397 కరోనా కేసులు..

సారాంశం

తెలంగాణలో కరోనా కేసులు కాస్త తగ్గుముఖం పట్టినా కొత్త కేసులు నమోదవుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న రాత్రి 8 గంటల వరకు 42,737 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా కొత్తగా 397 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 

దీంతో మొత్తం ఇప్పటివరకు నమోదైన కేసుల సంఖ్య 2,85,465కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. 

నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,535కి చేరింది. కరోనా బారినుంచి నిన్న 627మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న వారి సంఖ్య 2,77,931కి చేరింది.

ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 5,999 ఉండగా వీరిలో 3,838మంది హోం ఐసోలేషన్ లో చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు నిర్వహించిన కరోనా పరీక్షల సంఖ్య 67,93,691కి చేరింది. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం