భార్యను వదిలేసిన తమ్ముడి కోసం: భర్తను చంపాలని కూతురిపై ఒత్తిడి, చివరికిలా....

By telugu teamFirst Published Sep 14, 2020, 6:58 AM IST
Highlights

తల్లి వేధింపులకు ఓ మహిళ బలైంది. తన తమ్ముడికిచ్చి పెళ్లి చేయాలని తలచి భర్తను చంపాలని ఓ మహిళ కూతురిని వేధిస్తూ వచ్చింది. భర్తను చంపలేక ఆమె కూతురు ఆత్మహత్య చేసుకుంది.

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో ఆమానుషమైన సంఘటన జరిగింది. ఓ తల్లి ఒత్తిడి భరించలేక, భర్తను చంపలేక తానే ప్రాణాలు అర్పించింది ఓ మహిళ. తమ్ముడి కోసం అల్లుడిని కూతురితో చంపించాలని ఓ మహిళ ప్రయత్నించింది. అయితే, కూతురే ప్రాణాలు తీసుకుంది. మృతురాలు రాసిన లేఖ ఆధారంగా అసలు విషయాలు తెలిశాయి. ఈ సంఘటన హైదరాబాదులోని నేరేడుమెట్టలో జరిగింది. 

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా నందలూరు గ్రామానికి చెందిన కతి రాములమ్మ 945) మొదటి కూతురు గాయత్రిని రెండేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన సైదారావుకు ఇచ్చి పెళ్లి చేసింది. తన చిన్న తమ్ముడికి గాయత్రిని ఇచ్చి పెళ్లి చేయాలని ఉండేది. 

అదలావుంటే, ఏడాది క్రితం రాములమ్మ, గాయత్రి, సైదారావులు హైదరాబాదులోని నేరేడుమెట్టకు వచ్చి కాకతీయనగర్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. సైదరావు కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గాయత్రి ఇంటి పనులు చేస్తుండేది. రాములమ్మ నేరేడుమెట్టలో సాయినాథపురంలోని తన పెద్ద తమ్ముుడు సొడిపాగ పుల్లారావు (29)తో కలిసి ఉంటోంది. అతన్ని ఏడాది క్రితం భార్య వదిలేసింది. 

ఒంటరిగా ఉన్న తమ్ముడికి గాయత్రిని ఇచ్చి పెళ్లి చేయాలని రాములమ్మ తలపోసింది. తన కూతురికి దగ్గర కావాలని తమ్ముడికి చెప్పింది. దాంతో పుల్లారావు తరుచుగా గాయత్రి ఇంటికి వచ్చి పోతుండేవాడు. ఈ క్రమంలో తల్లి తన మనసులోని మాట గాయత్రికి చెప్పింది. అల్లుడిని చంపేయాలని చెప్పింది. ఆరు నెలల క్రితం వారు స్వగ్రామం వెళ్లారు. అక్కడ తల్లి, మేనమామ కలిసి గాయత్రికి పురుగుల మందు ఇచ్చి సైదారావును చంపాలని సూచించారు. 

అయితే, గాయత్రి అందుకు అంగీకరించలేదు. తిరిగి అందరూ నేరేడుమెట్టకు వచ్చిన తర్వాత భర్తను చంపాలని గాయత్రిపై తల్లీమేనమామలు ఒత్తిడి చేస్తూ వచ్చారు. తన భర్తను చంపలేక గాయత్రి ఆత్మహత్య చేసుకుంది. శుక్రవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. తన చావుకు తల్లీమేనమామలే కారణమని, భర్త చాలా మంచివాడని లేఖలో రాసింది. దాని ఆధారంగా ఆదివారం వారిని పోలీసులు అరెస్టు చేశారు.

click me!