పచ్చని కాపురంలో ఫోన్ కాల్ చిచ్చు...వివాహిత ఆత్మహత్య

By telugu teamFirst Published Nov 15, 2019, 7:16 AM IST
Highlights

అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్ అనే వ్యక్తది  సీతాల్ కి ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు.  దీంతో.. తట్టుకోలేక అతని ఫోన్ లోనే తిట్టేసింది. 

ఓ ఫోన్ కాల్.. పచ్చని సంసారంలో చిచ్చుపెట్టింది. అప్పటి వరకు అన్యోన్యంగా ఉన్న దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. ఓ ఆకతాయి సరదాగా చేసిన పని... వారి జీవితాలనే మలుపుతిప్పింది. చివరకు మహిళ ప్రాణాలు తీసుకునేదాక వెళ్లింది. ఈ సంఘటన కొమరం భీం జిల్లా జైనూరు మండలం కొండిబగూడ గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... కొండిబగూడకు చెందిన రమాకాంత్ కు నాలుగేళ్ల కిందట జైనూరు మండల కేంద్రంలోని శివాజీనగర్ కి చెందిన సోన్ కాంబ్లే సీతాల్ (24) తో వివాహం జరిగింది. ఇద్దరూ కూలీ పనులు చూసుకుంటూ దంపతులు ఇద్దరూ సంతోషంగా జీవించేవారు. కాగా... వారి పచ్చని కాపురంలో ఓ ఫోన్ కాల్ వచ్చి చిచ్చు పెట్టింది.

అదే గ్రామానికి చెందిన బొడికే అనికేతన్ అనే వ్యక్తది  సీతాల్ కి ఫోన్ చేసి విసిగించడం మొదలుపెట్టాడు. తరచూ ఫోన్ చేసి అసభ్యంగా మాట్లాడి వేధించేవాడు.  దీంతో.. తట్టుకోలేక అతని ఫోన్ లోనే తిట్టేసింది. కోపంతో ఊగిపోయిన ఆ యువకుడు సీతాల్ భర్త రమాకాంత్ కి ఫోన్ చేసి.. భార్య గురించి  చెడుగా చెప్పాడు. అతను తరచూ చెప్పడంతో.. రమాకాంత్ కి కూడా భార్యపై అనుమానం కలిగింది. 

ఈ విషయంలో భార్యను నిలదీశాడు. తాను ఎలాంటి తప్పు చేయకుండానే భర్త తనను అనుమానించడం ఆమె తట్టుకోలేకపోయింది. అంతేకాకుండా.. భర్త ప్రతి విషయంలో తనకు ఆంక్షలు విధించి.. అనుమానించడం ఆమెను బాధించింది. దీంతో  భర్త ఇంట్లో లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించగా.. హాస్పిటల్ లో చికిత్స పొందుతూ కన్నుమూసింది. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

click me!