భర్తతో గొడవ... బిడ్డతో సహా పై నుంచి దూకేసిన భార్య

Published : Feb 03, 2021, 07:23 AM IST
భర్తతో గొడవ... బిడ్డతో సహా పై నుంచి దూకేసిన భార్య

సారాంశం

బిహార్‌కు చెందిన బిమల్‌ కుమార్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తూ, భార్య ఆర్తి (22)తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30కి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. 

భర్తతో గొడవ పడి ఓ మహిళ  దారుణానికి ఒడిగట్టింది. బిడ్డతో సహా మేడపై నుంచి కిందకు దూకేసింది. కాగా...  ఈ ఘటనలో మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. చిన్నారి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన హైదరాబాద్ నగరంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బిహార్‌కు చెందిన బిమల్‌ కుమార్‌ నగరంలోని ఓ ప్రైవేట్‌ సంస్థలో పని చేస్తూ, భార్య ఆర్తి (22)తో కలిసి ఇక్కడే ఉంటున్నాడు. సోమవారం రాత్రి 11.30కి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్తి తన కూతురుతో సహా బయటకు వచ్చి ఇంటి గడియ వేసి భవనం రెండో అంతస్తుకు వెళ్లి కిందికి దూకింది. చుట్టుపక్కల వారు గమనించి గడియ తీసి భర్తకు విషయం చెప్పారు. బాధితురాలితో పాటు చిన్నారిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆర్తి మృతి చెందింది. ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

PREV
click me!

Recommended Stories

Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్
Cold Wave: వ‌చ్చే 2 రోజులు జాగ్ర‌త్త‌, ఈ జిల్లాల‌కు ఆరెంజ్ అల‌ర్ట్‌.. స్కూల్‌ టైమింగ్స్‌లో మార్పులు