మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్ కుమార్ (23) మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురం చెందిన స్రవంతి అనే యువతి ఫోన్ లో పరిచయం అయింది. ఇద్దరు రోజూ ఫోన్ లో మాట్లాడుకునేవారు.
వరంగల్ : ఓకే అమ్మాయి 3 పేర్లు, మూడు వేర్వేరు ఫోన్ నెంబర్లు.. ముగ్గురిలా మాట్లాడుతూ...మాయ చేసింది. ఓ యువకుడికి ప్రేమ వల విసిరింది. రకరకాల కథలు చెప్పింది. వేధింపులకు గురి చేసింది. బెదిరింపులకు కూడా దిగింది. చివరికి అతని ఆత్మహత్యకు కారణమైంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మెరిపిరాలలో ఈ ఘటన చోటు చేసుకుంది. యువకుడి తల్లిదండ్రుల కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి...
మెరిపిరాలకు చెందిన మైలపాక సోమయ్య, జయమ్మ కుమారుడు మైలపాక సందీప్ కుమార్ (23) మహబూబాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ల్యాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నాడు. ఈ క్రమంలో తన సోదరుడితో కలిసి చదివిన దుగ్గొండి మండలం లక్ష్మీపురం చెందిన స్రవంతి అనే యువతి ఫోన్ లో పరిచయం అయింది. ఇద్దరు రోజూ ఫోన్ లో తరచుగా మాట్లాడుకునేవారు.
undefined
ఈ క్రమంలో ఓ రోజు తాను సందీప్ ను ప్రేమిస్తున్నట్లు చెప్పింది స్రవంతి.. అంతేకాదు.. తానే..మరో ఇద్దరు యువతులు లాగా కావ్య, మనీషా అనే పేర్లతో.. వేరే నెంబర్లతో ఫోన్ చేయడం ప్రారంభించింది. ముగ్గురు వేర్వేరు అమ్మాయిల లాగా ప్రవర్తిస్తూ... నేను ప్రేమిస్తున్నాను.. అంటే నేను ప్రేమిస్తున్నాను.. అంటూ చెప్పుకొచ్చింది.
ఫోన్లో మాట్లాడడం తప్ప వారిద్దరూ ఎప్పుడూ ప్రత్యక్షంగా చూసుకోలేదు. ఇలా మాట్లాడే క్రమంలో కావ్య, మనీషాలాగా ఫోన్ చేసే స్రవంతి ఎంత రెచ్చగొట్టినా..సందీప్ తన మొదట పరిచయమైన స్రవంతిని ప్రేమిస్తున్నానని చెప్పేవాడు. అయితే, ఈ క్రమంలో స్రవంతికి వేరే వ్యక్తితో పెళ్లి అయింది.
కానీ ఆమె మిగతా ఇద్దరు లాగా ఫోన్లో మాట్లాడుతూనే ఉంది. స్రవంతి పెళ్లి అయిపోయిందన్న విషక్ష్ం తెలుసుకున్న.. కావ్య, మనీషా పేర్లతో ఫోన్ చేసే స్రవంతి.. స్రవంతి పెళ్లి అయిపోయింది కదా నన్ను పెళ్లి చేసుకో.. అంటూ కావ్యలాగా ఓసారి, మనీషా లాగా ఓ సారి అనేది. అయితే, సందీప్ తను ఒకే అమ్మాయిని ప్రేమించానని, ఆమెకు పెళ్లి అయిపోయింది కాబట్టి ఇక ఎవరిని తాను ప్రేమించలేను అని చెప్పేవాడు.
ఇలా ఆరు నెలలు గడిచిపోయాయి. తర్వాత స్రవంతి భర్తను వదిలేసి వచ్చిందని, కాబట్టి నన్ను ప్రేమించక పోయినా పర్వాలేదు.. కానీ ఆమెను పెళ్లి చేసుకోవాలంటూ మిగతా ఇద్దరి పేర్లతో ఫోన్ చేసి వేధించడం ప్రారంభించింది. అయితే సందీప్ గతంలో తాను ప్రేమించిన మాట నిజమే కానీ... తనను కాదని ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాక ఆమెను ఎలా చేసుకుంటానని చెప్పేవాడు.
అయినా, నీకోసమే భర్తను వదిలేసి వచ్చిందని.. పెళ్లి చేసుకుని తీరాల్సిందేనని ఆ రెండు పేర్లతో ఫోన్లో మాట్లాడుతూ బెదిరించడం మొదలు పెట్టింది. దీన్ని తట్టుకోలేక.. మనస్థాపానికి గురైన సందీప్ నెల 12 న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.. గమనించిన కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. మృతుడి తండ్రి సోమయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ బండారి రాజు తెలిపారు.