పెళ్లి పేరుతో ఐటీ ఉద్యోగికి గాలం.. రూ.కోటి కాజేసి..

By telugu news teamFirst Published Jun 2, 2020, 9:05 AM IST
Highlights

తాను అమెరికాలో ఉంటానని, డాక్టర్‌గా పనిచేస్తున్నానని అనుపల్లవి నమ్మబలికింది. తన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లో ఉంటూ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పింది. తల్లిదండ్రులు తనను పారిశ్రామికవేత్త కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని చూస్తున్నారని, తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఆమె తెలిపింది.

మోసాలు చేయడంలో ఆమె ఆరితేరింది. పెళ్లి కావాల్సిన ఐటీ ఉద్యోగులే ఆమె టార్గెట్. తాను అమెరికాలో ఉంటానని.. అక్కడ డాక్టర్ గా పనిచేస్తున్నానని తొలుత వాళ్లని నమ్మిస్తుంది. ఆ తర్వాత తీయని మాటలతో మత్తులోకి దింపి డబ్బులు గుంజేస్తోంది. ఇటీవల నగరానికి చెందిన ఓ ఐటీ కుర్రాడు ఆమె బుట్టలో పడిపోయాడు. అతని వద్ద నుంచి ఆమె దాదాపు రూ.కోటి గుంజేయడం గమనార్హం. కాగా.. చివరకు ఆమె పోలీసులకు చిక్కింది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. కూకట్‌పల్లి వసంతనగర్‌లో నివాసముండే ఉప్పాలపాటి చైతన్య విహారి సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈయనకు తెలుగు మ్యాట్రిమోనీ వెబ్‌సైట్‌ ద్వారా అనుపల్లవి మాగంటి పేరుతో ఐడీ ఉన్న ఓ యువతి 2018లో పరిచయమైంది. అప్పటి నుంచి ఇద్దరూ చాటింగ్‌, వాట్సాప్‌ కాలింగ్‌ ద్వారా మాట్లాడుకొనేవారు. 

తాను అమెరికాలో ఉంటానని, డాక్టర్‌గా పనిచేస్తున్నానని అనుపల్లవి నమ్మబలికింది. తన తల్లిదండ్రులు జూబ్లీహిల్స్‌లో ఉంటూ వైద్యులుగా విధులు నిర్వహిస్తున్నారని చెప్పింది. తల్లిదండ్రులు తనను పారిశ్రామికవేత్త కుమారుడికి ఇచ్చి వివాహం చేయాలని చూస్తున్నారని, తనకు ఇష్టంలేని పెళ్లి చేస్తున్నారని ఆమె తెలిపింది.

 తన బ్యాంకు ఖాతా నెంబర్లు నిలిపివేయించారని, తల్లిదండ్రులపై న్యాయపోరాటం చేసేందుకు డబ్బు అవసరమని, తర్వాత మనం పెళ్లి చేసుకొందామని ఆమె చైతన్యను నమ్మించింది. దీంతో చైతన్య పలుమార్లు ఆమె పంపిన బ్యాంకు ఖాతాకు రూ.1,02,18,033 పంపాడు. అనంతరం ఆమె కాంటాక్ట్‌లో లేకుండా పోయింది. మోసపోయినట్లు గుర్తించిన చైతన్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

click me!