జలదీక్ష: ఎక్కడికక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు

Published : Jun 02, 2020, 07:30 AM ISTUpdated : Jun 02, 2020, 07:31 AM IST
జలదీక్ష: ఎక్కడికక్కడ తెలంగాణ కాంగ్రెస్ నేతల హౌస్ అరెస్టు

సారాంశం

జలదీక్షను తలపెట్టిన తెలంగాణ కాంగ్రెసు నేతలను పోలీసులు ఎక్కడికక్కడ హౌస్ అరెస్టు చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల వద్ద మంగళవారం కాంగ్రెసు నేతలు జలదీక్షను తలపెట్టారు.

హైదరాబాద్: జలదీక్ష తలపెట్టిన తెలంగాణ కాంగ్రెసు నేతలను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టు చేస్తున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల వద్ద తెలంగాణ కాంగ్రెసు నేతలు జలదీక్షలు చేయాలని సంకల్పించారు. వారిని అడ్డుకోవడానికి పోలీసులు గృహ నిర్బంధం చేస్తున్నారు. మంగళవారం ఉదయం 7 గంటల లోపలే పలువురు కాంగ్రెసు నేతలను పోలీసులు గృహ నిర్బంధం చేశారు. 

పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. ఎస్ఎల్బీసీని చూడడానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు గృహ నిర్బంధం చేయడమేమిటని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై ప్రధాన న్యాయమూర్తికి కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన చెప్పారు. 

తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కాంగ్రెసు నేతలను ఎక్కడికక్కడ ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. నాయకుల ఇళ్ల ముందు పెద్ద యెత్తున పోలీసులు మోహరించారు. సంపత్ కుమార్ ను పోలీసులు గృహ నిర్బంధం చేసారు. మాజీ ఎమ్మెల్యే వంశీచంర్ రెడ్డిని కూడా హౌస్ అరెస్టు చేశలారు. 

లక్ష్మీహౌస్ పంప్ హౌస్ వద్ద కాంగ్రెసు ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర రెడ్డి జలదీక్షను తలపెట్టారు.  

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం