వృద్దురాలిని చీపురుతో చితకబాదిన కసాయి కోడలు... ఎంత అమానుషం..! (వీడియో)

By Arun Kumar P  |  First Published Sep 20, 2023, 11:26 AM IST

వృద్దురాలైన అత్తను ఓ కసాయి కోడలు విచక్షణారహితంగా చితకబాదుతూ చిత్రహింసలకు గురిచేసిన ఘటన భువనగిరిలో వెలుగుచూసింది.  


భువనగిరి : అత్తా కోడళ్ల గొడవలు ప్రతి ఇంట్లోనూ వుంటాయి... ఎంత గొడవపడ్డా వృద్దాప్యంలో వున్న అత్తామామలను సొంత అమ్మానాన్నల్లా చూసుకుంటారు కొందరు కోడళ్లు. మరికొందరు తప్పదు కాబట్టి కసురుకుంటూ అత్తామామలకు సేవలు చేస్తుంటారు. అయితే కొందరు కోడళ్లు మాత్రం ఏమాత్రం జాలి, దయ లేకుండా వృద్దులని కూడా చూడకుండా అత్తామామలను చిత్రహింసలు పెడుతుంటారు. ఇలాంటి ఓ కోడలు అత్తను చితకబాదిన ఘటన యాదాద్రి భువనగిరి జిల్లాలో వెలుగుచూసింది. 

యాదాద్రి జిల్లా వలిగొండ గ్రామానికి చెందిన లక్ష్మమ్మకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు కుటుంబంతో కలిసి భువనగిరిలో వుంటున్నాడు. దీంతో వృద్దాప్యంతో బాధపడుతున్న లక్ష్మమ్మ పెద్దకొడుకు వద్ద వుంటోంది. అయితే కోడలు పద్మకు లక్ష్మమ్మ చిత్రహింసలకు గురిచేస్తున్న ఘటన తాజాగా వెలుగుచూసింది.  

Latest Videos

వీడియో

ఇంటిబయట మంచంపై పడుకున్న అత్త లక్ష్మమ్మను కోడలు చీపురుతో చితకబాదుతున్న వీడియో బయటకు వచ్చింది. అత్తంటే ఇష్టం లేకపోయినా వృద్దురాలన్న కనీస జాలి చూపించలేదు ఆ కసాయి కోడలు. విచక్షణారహితంగా చీపురుతో కొడుతుంటే ఆ వృద్దురాలు ఆర్తనాదాలు పెట్టింది. లక్ష్మమ్మ పరిస్థితి చూసి చలించిపోయిన వ్యక్తులెవరో చాటుగా ఈ చిత్రహింసలకు సంబంధించిన వీడియో తీసారు. 

Read More  వరసకు కూతురైన యువతిని ప్రేమించిన యువకుడు.. నలుగురి సాయంతో దారుణంగా హత్య చేసిన తండ్రి

తల్లిని వదిన కొడుతున్న వీడియో చూసి చలించిపోయిన చిన్నకొడుకు పోలీసులకు ఫిర్యాదు చేసాడు. దీంతో భువనగిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. లక్ష్మమ్మను కోడలు చిత్రహింసలు పెడుతున్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. వృద్దురాలిని చిత్రహింసలు పెడుతున్న కోడలిపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

click me!