బావ మీద మోజు.. కట్టుకున్న భర్తనే.. దారుణంగా..

Published : Jul 30, 2021, 09:42 AM IST
బావ మీద మోజు.. కట్టుకున్న భర్తనే.. దారుణంగా..

సారాంశం

మల్కాపూర్ కు చెందిన నాటుకారి రామలింగం (34) ఈనెల 26న హత్యకు గురయ్యాడు. అతడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ ఎస్ఐలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

సంగారెడ్డి  : ఈనెల 26న కొండాపూర్లో జరిగిన హత్యకు వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. ఈ ఘటనకు కారణమైన ఆటో, రెండు ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.  గురువారం నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. సంగారెడ్డి డీఎస్పీ బాలాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

మల్కాపూర్ కు చెందిన నాటుకారి రామలింగం (34) ఈనెల 26న హత్యకు గురయ్యాడు. అతడి తండ్రి బాలయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీఐ ఎస్ఐలు ప్రత్యేక బృందంగా ఏర్పడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా విచారణ చేయగా.. విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

 రామలింగం భార్య అనితకు బావ వరసయ్యే భాస్కర్ తో వివాహేతర సంబంధం ఉంది.  ఈ విషయమై భార్యాభర్తలు తరచుగా గొడవ పడుతూ ఉండేవారు. ఈ నేపథ్యంలో రామలింగం భార్యతో గొడవపడి ఊర్లో ఉంటున్న తల్లిదండ్రుల వద్దకు వెళ్ళాడు. అదే సమయంలో అతడిని హత్య చేయాలని అనిత, భాస్కర్ నిర్ణయించుకుని ఈ నెల 25న రాత్రి రామలింగంను నమ్మించి, భాస్కర్ ఆటోలో మల్కాపూర్ శివారుకు తీసుకువచ్చారు. అక్కడ మద్యం తాగించి, రాయితో కొట్టి హత్య చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది.

నిందితులు ఇద్దరినీ అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. కేసును 48 గంటల్లో చేధించిన సీఐ లక్ష్మారెడ్డి,  ఎస్సై సంతోష్ కుమార్, సిబ్బందిని డిఎస్పీ అభినందించారు. 

PREV
click me!

Recommended Stories

ఏటీఎమ్‌లలో కొత్త ర‌కం దోపిడి.. సైబ‌ర్ క్రైమ్ కోర్స్ నేర్చుకుని క్రిమిన‌ల్‌గా మారిన యువ‌కుడు
పార్టీ పెడతా: Kalvakuntla Kavitha Sensational Statement | Will Launch NewParty | Asianet News Telugu