వివాహేతర సంబంధం : వేధిస్తున్నాడని.. గొంతు నులిమి అంతమొందించారు.. !

Published : Apr 23, 2021, 10:17 AM IST
వివాహేతర సంబంధం : వేధిస్తున్నాడని.. గొంతు నులిమి అంతమొందించారు.. !

సారాంశం

వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యలు, ఆత్మహత్యలకు తెగబడుతున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇది దానికి భిన్నం.. వివాహేతర సంబంధం పెట్టుకోమని వేధిస్తున్నందుకు హత్య జరిగింది.

వివాహేతర సంబంధం పెట్టుకుని హత్యలు, ఆత్మహత్యలకు తెగబడుతున్న సంఘటనలు రోజురోజుకూ పెరుగుతున్నసంగతి తెలిసిందే. అయితే ఇది దానికి భిన్నం.. వివాహేతర సంబంధం పెట్టుకోమని వేధిస్తున్నందుకు హత్య జరిగింది.

వివరాల్లోకి వెడితే.. వివాహేతర సంబంధం పెట్టుకోవాలని వేధిస్తున్న ఓ వ్యక్తిని సదరు మహిళ తన సోదరుడితో కలిసి హతమార్చింది. నిజామాబాద్ జిల్లా,  బిచ్కుందకు చెందిన మైత్రి హనుమాండ్లు మృతదేహం ఈ నెల 18న బిచ్కుంద సౌదర్ చెరువులో దొరికింది.

దీనిమీద కేసు నమోదు చేసి విచారణ చేపట్టిన పోలీసులు కేసును ఛేదించారు. గురువారం బాన్సువాడ సీఐ రామకృష్ణారెడ్డి బిచ్కుంద పోలీస్ స్టేషన్ లో కేసు వివరాలు వెల్లడించాడు. హనుమాండ్లు తన ఇంటి పక్కనే ఉండే నాగమణి అనే మహిళను వివాహేతర సంబంధం పెట్టుకోవాలని తరచుగా వేధిస్తుండేవాడు. 

నాగమణి ఎన్నిసార్లు నిరాకరించినా వేధింపులు మానలేదు.. దీంతో ఆమె తక్కడ్ పల్లికి చెందిన తన అన్న బాలయ్యతో విషయం చెప్పింది. అతని సాయంతో హనుమాండ్లును హతమార్చాలని నిర్ణయించుకుంది. 

ఈ నెల 16న బాలయ్య, నాగమణి హనుమాండ్లను చెరువు గట్టుకు రమ్మన పిలిచారు. అక్కడికి వచ్చిన హనుమాండ్ల మీద దాడి చేశారు. అతని గొంతు నులిమి చంపేశారు. ఆ తరువాత మృతదేహాన్ని చెరువులో పడేశారు.

కేసును ఛేదించిన పోలీసులు హత్య చేసిన నాగమణి, బాలయ్యలను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. 
 

PREV
click me!

Recommended Stories

Sydney Bondi Beach ఉగ్రదాడి: నిందితుడు సాజిద్ అక్రమ్‌కు హైదరాబాద్ లింకులు.. భారత పాస్‌పోర్ట్‌తో షాకింగ్ !
Sankranti Holidays : ఉద్యోగులకూ పండగే.. ఈ సంక్రాంతికి వరుసగా తొమ్మిది రోజుల సెలవులు?