బీజేపీకి కేటీఆర్‌ బంపర్ఆఫర్ : ఎన్నికలప్పుడు కొట్టుకుందాం.. తరువాత కలిసి పనిచేద్దాం..

Published : Jan 09, 2021, 12:41 PM IST
బీజేపీకి కేటీఆర్‌ బంపర్ఆఫర్ : ఎన్నికలప్పుడు కొట్టుకుందాం.. తరువాత కలిసి పనిచేద్దాం..

సారాంశం

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. 

తెలంగాణ మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంఖుస్థాపన చేశారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో డబుల్ బెడ్ రూమ్ లను లబ్ధిదారులకు అందజేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ... పండుగ వాతావరణంలో లంబడి తండాలో డబుల్ బెడ్ రూంలు అడబిడ్డలకు ఇవ్వడం సంతోషంగా ఉందని, 18 వేల కోట్ల రూపాయలతో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. 

28 రాష్ట్రాలలో ఎక్కడ ఇలా ఇల్లు ఇవ్వడం లేదని,  విలువైన ఇళ్ళు ఇవాళ  ప్రజల చేతికి అందిస్తున్నామని పేర్కొన్నారు.  వీటి విలువ మార్కెట్లో 40-50 లక్షల వరకు ఉంటుందని, అటువంటి డబుల్ బెడ్ రూమ్ లు లబ్దిదారులకు ఇస్తున్నామని తెలిపారు. 

ఈ ఇండ్లు కిరాయికి ఇవ్వడం కానీ, అమ్మడం కానీ చేయద్దని ఒక వేళ అలా చేస్తే రద్దు చేసే అధికారం కూడా ప్రభుత్వానికి ఉందన్నారు.  హైదరాబాద్ లో లక్ష బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం పూర్తి కావొస్తుందని తెలిపారు.

అలాగే ఈ సందర్భంగా బీజేపీకి కేటీఆర్‌ ఓ విజ్ఞప్తి చేశారు. ఎన్నికలప్పుడు పోటీ పడదామని... ఎవరి వాదనలు వారు గట్టిగా చెప్పుకుందామని పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత అభివృద్ధి కోసం కలసి పనిచేద్దామని, హుందాగా రాజకీయాలు చేద్దామని చెప్పుకొచ్చారు. 

PREV
click me!

Recommended Stories

ముగిసిన పల్లె పోరు.. కాంగ్రెస్‌దే ఆధిపత్యం.. బీఆర్ఎస్ సంతృప్తి.. ఏయే పార్టీలు ఎన్ని స్థానాలు గెలిచాయంటే
100 ఏళ్లైన చెక్కుచెద‌ర‌ని, అతిపెద్ద ప్రార్థ‌న మందిరం.. హైద‌రాబాద్‌కు ద‌గ్గ‌రలో అద్భుత నిర్మాణం