త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Mar 29, 2022, 02:58 PM IST
త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్.. మంత్రి హరీశ్ రావు కీలక వ్యాఖ్యలు

సారాంశం

త్వరలో మెడికల్ షాపుల్లోనూ దళితులకు రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. దళిత బంధు పథకం గురించి చెబుతూ ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు.  

దళితుల జీవితాల్లో వెలుగులు నింపాలనేదే ముఖ్యమంత్రి కేసీఆర్ (kcr) ఆశయమన్నారు తెలంగాణ ఆర్ధిక మంత్రి హరీశ్ రావు (harish rao). దళితబంధు (dalit bandhu scheme) అనేది కేవలం ఒక పథకం కాదని... దళితుల అభ్యున్నతి కోసం ప్రారంభించిన ఒక ఉద్యమమని పేర్కొన్నారు. దళితబంధు పథకం ద్వారా కేవలం ఆర్థిక సాయాన్ని అందించడమే కాకుండా, వారి వ్యాపారాభివృద్ధికి అధికారులు అన్ని విధాలుగా సహకరిస్తారని హరీశ్ రావు వెల్లడించారు. వైన్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్ కల్పించామని ఆయన గుర్తుచేశారు. రాబోయే రోజుల్లో మెడికల్ షాపుల్లో కూడా దళితులకు రిజర్వేషన్లు కల్పించబోతున్నామని హరీశ్ రావు స్పష్టం చేశారు. 

కాగా.. తెలంగాణలో వరి ధాన్యం కొనుగోలు (paddy procurement) విషయంలో టీఆర్‌ఎస్ (trs) , బీజేపీల (bjp) మధ్య మాటల యుద్దం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ధాన్యం కొనుగోలుకు సంబంధించి కేంద్రంలోని మోదీ సర్కార్‌పై (narendra modi) ఇటీవల హరీష్ రావు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వడ్లు కొనమని మొండికేసింది కేవలం మోదీ ప్రభుత్వమేనని మండిపడ్డారు. ప్రభుత్వాలు ప్రజల కోసం పనిచేయాలని, దేశానికి అన్నం పెట్టే రైతు కోసం పనిచేయాలన్నారు.  సిద్దిపేటలో హరీష్ రావు మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం ఎఫ్‌సీఐ ద్వారా పంట కొనుగోలు చేయాలని రాజ్యాంగంలోనే ఉందన్నారు.

గతంలో అన్ని ప్రభుత్వాలు వడ్లు కొనుగోలు చేశాయని హరీష్ రావు చెప్పారు. మొట్టమొదటి సారి మోడీ ప్రభుత్వం వడ్లు కొనమని మొండికేస్తుందని విమర్శించారు. పంజాబ్‌లో వడ్లు కొని తెలంగాణ లో ఎందుకు కొనడం లేదని టీఆర్‌ఎస్ ఎంపీ లు ఢిల్లీలో కొట్లాడుతున్నారని చెప్పారు. పంజాబ్ కి ఒక న్యాయం.. తెలంగాణ కు ఒక న్యాయమా అని హరీష్ రావు మండిపడ్డారు. ధాన్యం కొనుగులు బాధ్యత కేంద్రానిదేనని చెప్పారు. ‘వన్ నేషన్.. వన్ రేషన్’ అన్నప్పుడు.. ‘‘వన్ నేషన్.. వన్ ప్రొక్యూర్‌‌మెంట్’’ ఉండాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 

ధాన్యం కొనుగోలు బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశారు. ఒక్క తెలంగాణ వడ్ల విషయంలోనే వివక్ష ఉందని ఆక్షేపించారు. పార్టీ ఆదేశాల మేరకు త్వరలో ప్రతి ఇంటిపై నల్ల జెండాలతో నిరసన తెలపాలని హరీష్‌రావు పిలుపునిచ్చారు. బీజేపీ రైతు వ్యతిరేక విధానాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ రైతు వ్యతిరేక విధానాలపై ప్రతిచోట చర్చ జరిగే విధంగా చూడాలని టీఆర్‌ఎస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.  వడ్లు కొనుగోలు చేయాలని ప్రతి గ్రామాంలో ఏక గ్రీవ తీర్మానం చేసి మోడీకి పంపాలన్నారు. 

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను తెచ్చిందని తెలిపారు. బీజేపీ పాలించే ఏ రాష్ట్రంలో కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం లేదన్నారు. ఎరువుల ధరలు పెంచి రాయితీ తగ్గించారని విమర్శించారు. కానీ తెలంగాణలో ఆయిల్ ఫామ్ కోసం బడ్జెట్ లో వెయ్యి కోట్లు పెట్టామని గుర్తు చేశారు. బీజేపీ ఎన్నికల ముందు ధరలు తగ్గించి.. ఎన్నికలు కాగానే ధరలు పెంచుతుందని మండిపడ్డారు. 

PREV
click me!

Recommended Stories

Hyderab IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి
హైద‌రాబాద్ స‌మీపంలోని ఈ గ్రామం మ‌రో గ‌చ్చిబౌలి కావ‌డం ఖాయం.. పెట్టుబ‌డి పెట్టే వారికి బెస్ట్ చాయిస్‌