నాకు ఈ భర్త వద్దు... ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

Published : Jul 04, 2019, 09:27 AM IST
నాకు ఈ భర్త వద్దు... ఇంటి నుంచి వెళ్లిపోయిన భార్య

సారాంశం

నెలన్నర క్రితమే వారిద్దరికీ వివాహమైంది. కొద్ది రోజులపాటు దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు... నాకు ఈ భర్త వద్దు... నాకు ఇష్టం లేదంటూ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. 


నెలన్నర క్రితమే వారిద్దరికీ వివాహమైంది. కొద్ది రోజులపాటు దంపతులు ఇద్దరూ బాగానే ఉన్నారు. తర్వాత ఏమైందో తెలీదు... నాకు ఈ భర్త వద్దు... నాకు ఇష్టం లేదంటూ భార్య ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఈ సంఘటన మేడ్చల్ లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... చంద్రానగర్‌కు చెందిన వ్యక్తికి గత మే 15న ఓ యువతిని   ప్రేమ పెళ్లి చేసుకున్నాడు. నెలన్నర వరకు సంతోషంగా గడిపారు. జూన్‌ 26న తన బంధువుల ఇంటికి వెళ్లిన భార్య జులై 1న తిరిగి వచ్చింది. ఆమె ప్రవర్తనలో మార్పు రావడంతో నిలదీసిన భర్తకు నువ్వు నాకు ఇష్టం లేదని చెప్పింది. మంగళవారం తన తల్లికి ఆరోగ్యం బాగాలేదని భర్త ఇంటికి వెళ్లి వచ్చే చూసేవరకు భార్య కనిపించలేదు.  ఫోన్‌ స్విచ్‌ ఆఫ్‌ అని రావడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: విద్యా అభివృద్ధికి రూ. 26,600 కోట్లు సీఎం రేవంత్ రెడ్డి పవర్ ఫుల్ స్పీచ్
Governor Shiv Pratap Shukla Speech: తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా సూపర్ స్పీచ్