అంబటి రాయుడి రిటైర్మెంట్ పై కేటీఆర్ స్పందన ఇదీ...

Published : Jul 04, 2019, 06:39 AM IST
అంబటి రాయుడి రిటైర్మెంట్ పై కేటీఆర్ స్పందన ఇదీ...

సారాంశం

భారత క్రికెటర్‌ రాయుడు రిటైర్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు.

హైదరాబాద్: భారత క్రికెటర్‌ రాయుడు రిటైర్మెంట్‌పై తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు ట్విట్టర్‌లో స్పందించారు. రాయుడు అసలైన చాంపియన్‌ అని, సెలెక్టర్లు పట్టించుకోకపోయినా క్రికెట్‌ ఫ్యాన్స్‌ రాయుడును ఎప్పటికీ మరచిపోరని ఆయన అన్నారు. రాయుడు సెకండ్‌ ఇన్నింగ్స్‌ బాగుండాలని ఆయన ఆకాంక్షించారు. 

ప్రపంచ కప్ పోటీలకు తనను కాకుండా మయాంక్ అగర్వాల్ ను ఎంపిక చేయడంపై తీవ్ర మనోవేదనకు గురైన అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్ అన్ని ఫార్మాట్ల నుంచి రిటైర్ అయిన విషయం తెలిసిందే. 

 

PREV
click me!

Recommended Stories

Hyderabad లో ప్రస్తుతం కిలో టమాటా ధర ఎంత..?
Sankranti Weather : తెలుగోళ్ళకు గుడ్ న్యూస్.. సంక్రాంతి పండక్కి సరైన వెదర్