ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్తకు తెలిసిపోయిందని..

Published : Mar 19, 2019, 11:02 AM IST
ప్రియుడితో అక్రమ సంబంధం.. భర్తకు తెలిసిపోయిందని..

సారాంశం

భర్తకు తెలియకుండా గుట్టుగా.. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో.. ప్రియుడితో కలిసి.. హత్య చేసింది. 

భర్తకు తెలియకుండా గుట్టుగా.. ప్రియుడితో అక్రమ సంబంధం పెట్టుకుంది. తీరా ఈ విషయం భర్తకు తెలియడంతో.. ప్రియుడితో కలిసి.. హత్య చేసింది. తీరా.. పోలీసులకు దొరకకుండా.. ఉండేందుకు సహజ మరణంగా చిత్రీకరించేందుకు ప్రయత్నించింది. ఈ సంఘటన సోమవారం మీర్ పేటలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే... యాదాద్రి జిల్లా, పోర్లగడ్డతండాకు చెందిన వడ్త్యా గోపి (35) భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నగరానికి వలస వచ్చి నాగోలు అల్కాపురిలో ఉంటున్నాడు. భార్యాభర్తలిద్దరూ అల్కాపురిలో  బిల్డింగ్‌ మెటీరియల్‌ విక్రయించే వీరాస్వామి వద్ద పని చేసేవారు. ఈ క్రమంలోనే వీరాస్వామి లక్ష్మితో వివాహేతర సంబంధం పెట్టుకోవడాన్ని గుర్తించిన గోపి మూడు నెలల క్రితం అక్కడ పని మానేసి  కర్మన్‌ఘాట్‌ భూపేష్‌గుప్తానగర్‌కు మకాం మార్చాడు.

అనంతరం ఆటో నడుపుతూ.. జీవనం సాగిస్తున్నాడు. భర్తకు నిజం తెలీడంతో.. తమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చెప్పి.. లక్ష్మి ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. మద్యం తాగి మత్తులో ఉన్న గోపిని వీరా స్వామితో కలిసి..గొంతు నులిమి ముఖం, ఛాతిపై పిడిగుద్దులు గుద్దారు. దీంతో గోపి అక్కడికక్కడే మృతి చెందాడు.

 అనంతరం లక్ష్మి అదే ప్రాంతంలో ఉంటున్న గోపి తండ్రి బద్యా చంద్రుకు ఫోన్‌ చేసి గోపి గుండెపోటుతో మృతి చెందినట్లు చెప్పింది. అక్కడికి వచ్చిన కుటుంబసభ్యులు గోపి మృతదేహాన్ని అంత్యక్రియల నిమిత్తం  పోర్లగడ్డతండాకు తరలించారు. మృతదేహాన్ని పరిశీలించిన బంధువులు శరీరంపై తీవ్ర గాయాలు, గొంతు కమిలిపోయి ఉండటాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు గోపి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు హత్యగా నిర్ధారించారు. దీంతో నిందితులు లక్ష్మి, వీరాస్వామిఅదుపులోకి తీసుకుని  విచారిస్తున్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy: వంట చేసి విద్యార్థులతో కలిసి తిన్న సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
CM Revanth Reddy Inaugurates Telangana Public School | Breakfast Scheme Launched | Asianet Telugu