నవ వధువు ఆత్మహత్య.. భయంతో భర్త ఏంచేశాడంటే..

Published : Oct 12, 2018, 04:20 PM IST
నవ వధువు ఆత్మహత్య.. భయంతో భర్త ఏంచేశాడంటే..

సారాంశం

దుర్గారావుకి రెండు నెలల క్రితం ఉషా అనే యువతితో వివాహం జరిగింది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. సెడన్ గా ఏమైందో తెలీదు.. ఉషా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

పెళ్లై రెండు నెలలు కూడా నిండకముందే.. నవ వధువు.. ఆత్మహత్యకు పాల్పడింది. భార్య చావుకి తననే బాధ్యుడ్ని చేస్తారేమో అనే భయంతో భర్త కూడా ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సోములగూడెం గ్రామంలో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.. సోములగూడెం గ్రామానికి చెందిన దుర్గారావుకి రెండు నెలల క్రితం ఉషా అనే యువతితో వివాహం జరిగింది. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉండేవారు. సెడన్ గా ఏమైందో తెలీదు.. ఉషా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.

విషయం తెలుసుకున్న భర్త దుర్గారావు..ఇంటికి సమీపంలోని 11కేవీ విద్యుత్ తీగను పట్టుకొని ఆత్మహత్యకు యత్నించాడు. కాగా.. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అతనిని మెరుగైన చికిత్స నిమిత్తం కొత్తగూడెం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

భార్య ఆత్మహత్య, భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో.. ఆ కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
Hyderabad: ఇది పూర్త‌యితే హైద‌రాబాద్‌లో దేశంలో టాప్ సిటీ కావ‌డం ఖాయం.. ORR చుట్టూ మెగా ప్రాజెక్ట్‌