ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట మధ్య ఫోన్ చిచ్చు.. భార్య ఆత్మహత్య...

Published : May 06, 2022, 09:48 AM IST
ప్రేమించి పెళ్లిచేసుకున్న జంట మధ్య ఫోన్ చిచ్చు.. భార్య ఆత్మహత్య...

సారాంశం

సెల్ ఫోన్ ఎక్కువగా మాట్లాడుతుందని భర్త మందలించడంతో భార్య ఆత్మహత్య చేసుకున్న ఘటన హైదరాబాద్ లో కలకలం రేపింది. 

హైదరాబాద్ :  క్షణికావేశం.. చిన్న మాట కూడా తట్టుకోలేని స్వభావం.. ప్రతీదానికి అనుమానించడం.. నేటి రోజుల్లో ఇవి ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంతో అనవసరంగా, అర్థాంతరంగా నూరేళ్ల జీవితాలను ఫణంగా పెడుతున్నారు. బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఎంతో ప్రాణంగా ప్రేమించుకుని.. పెద్దల్ని ఎదురించి మరీ ఒక్కటైన జంటలు.. చిన్న చిన్న కారణాలతో గొడవలు పడి.. మనస్థాపాలకు గురై.. ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇలాంటి రెండు ఘటనలు హైదరాబాద్ లో చోటు చేసుకున్నాయి. 

ప్రేమించి పెళ్లి చేసుకున్న newly married couple మధ్య cell phone చిచ్చు పెట్టింది. మనస్థాపంతో ఆమె suicideకు పాల్పడింది. నేరేడ్మెట్ సిఐ నరసింహస్వామి చెప్పిన కథనం ప్రకారం… క్రిష్ణ కాంప్లెక్స్ లో ఉండే దివ్య (21), సప్తగిరి కాలనీలో ఉండే నవీన్ గత డిసెంబర్లో ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. దివ్య ఎక్కువగా ఫోన్ మాట్లాడుతుండడంతో ఇటీవల దంపతుల మధ్య గొడవ జరిగింది. ఆ తరువాత దివ్య ముభావంగా ఉంది. ఆ గొడవ ఆమెను ఎంతగా ఇబ్బంది పెట్టిందో తెలియదు కానీ... ఈ నెల 4న దివ్య తన చావుకు ఎవరూ బాధ్యులు కారని చేతిపై రాసుకుని ఉరి వేసుకుని చనిపోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఆ తరువాత ఆత్మహత్య మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తులో ఉంది. 

కాగా, ఇలాంటి ఘటనే నగరంలో ఇంకొకటి చోటు చేసుకుంది. వాళ్లిద్దరూ ఇష్టపడ్డారు. కలిసి జీవించాలనుకున్నారు. జీవితాంతం కలిసి నడుద్దామని బాసలు చేసుకున్నారు. ఎంతో ఆశపడి ఇంటో పెద్దలను ఎదురించి మరీ గుళ్లో Marriage చేసుకున్నారు. కానీ మూడు నెలలు కూడా నిండక ముందే వారి కాపురంలో విషాదం నెలకొంది. second show movie వారి కాపురంలో చిచ్చు రేపింది. మనస్తాపానికి గురైన భార్య గురువారం బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లి పట్టణంలో చోటు చేసుకుంది. శంకర్ పల్లి ఎస్ ఐ సంతోష్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. వికారాబాద్ జిల్లా తాండూరు మండలం సంగెం గ్రామానికి చెందిన  రాజు (22), స్వాతి (20) ప్రేమించుకున్నారు. 

ఈ ఫిబ్రవరిలో పెద్దలను ఎదురించి పెళ్లి చేసుకున్నారు. తరువాత ఇరువైపులా పెద్దలను ఒప్పించారు. రెండు నెలల కిందట శంకర్ పల్లి పట్టణంలోని భవానీనగర్ లో అద్దె గది తీసుకుని కాపురం పెట్టారు. రాజు హోటల్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం రాత్రి సెకండ్ షో సినిమాకు తీసుకెళ్లాలని భార్య కోరింది. దీనికి రాజు ఒప్పుకోలేదు. గురువారం తీసుకెడతానని చెప్పాడు. ఈ విషయంలో చిన్నపాటి గొడవ జరగ్గా.. మనస్తాపానికి గురైన స్వాతి గురువారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరి వేసుకుంది. సమాచారం అందుకుని వచ్చిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని చేవెళ్ల ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కుటుంబసభ్యలు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. 

PREV
click me!

Recommended Stories

Telangana Panchayat Elections: తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ జోరు
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్