కొడుకుతో కలిసి భర్త మీద పెట్రోల్ పోసి..నిప్పంటించి.. హతమార్చి...ఏమీ ఎరగనట్టు..

Published : Jan 07, 2022, 10:00 AM IST
కొడుకుతో కలిసి భర్త మీద పెట్రోల్ పోసి..నిప్పంటించి.. హతమార్చి...ఏమీ ఎరగనట్టు..

సారాంశం

 కొడుకు కళ్యాణ్, భార్య ససావత్ బుజ్జి గురువారం మధ్యాహ్నం బాబు మంచంపై పడుకున్న సమయం చూసి పెట్రోలు పోసి తగలబెట్టారు. fire వస్తుండడంతో స్థానికులు గమనించగా..  ససావత్ బాబు కాలిపోతూ కనిపించాడు. తల్లీ కొడుకులు రోడ్డుపైకి వచ్చి చూస్తున్నారు. స్థానికులు దుప్పటితో మంటలారిపే సరికి అప్పటికే పూర్తిగా కాలిపోయిన బాబు మృతిచెందాడు. 

తిరుమలగిరి : కుమారుడితో కలిసి భర్తను.. భార్య Petrol పోసి murder చేసిన ఘటన నల్గొండ జిల్లా తిరుమలగిరి మండలం జువ్వి చెట్టుతండాలో గురువారం చోటు చేసుకుంది.  స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..  జువ్వి చెట్టుతండాకు  చెందిన బాబు ససావత్ బాబు (45) వ్యవసాయం చేస్తూ కూలీ పనులకు వెళ్లేవాడు. వచ్చిన డబ్బులతో నిత్యం liquor తాగేవాడు. దీంతో భార్యకు, కుమారుడికి మధ్య తరచూ గొడవలు జరిగేవి.

దీంతో విసుగు చెందిన కొడుకు కళ్యాణ్, భార్య ససావత్ బుజ్జి గురువారం మధ్యాహ్నం బాబు మంచంపై పడుకున్న సమయం చూసి పెట్రోలు పోసి తగలబెట్టారు. fire వస్తుండడంతో స్థానికులు గమనించగా..  ససావత్ బాబు కాలిపోతూ కనిపించాడు. తల్లీ కొడుకులు రోడ్డుపైకి వచ్చి చూస్తున్నారు. స్థానికులు దుప్పటితో మంటలారిపే సరికి అప్పటికే పూర్తిగా కాలిపోయిన బాబు మృతిచెందాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని వివరాలు సేకరించి, విచారణ చేపడుతున్నట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.

ముగ్గురి బలవన్మరణం…
ఉమ్మడి నల్గొండ జిల్లాలో వేర్వేరు చోట్ల ముగ్గురు బలవన్మరణం చెందారు. వివరాల్లోకి వెళితే... కట్టంగూరు మండలంలోని అయిటిపాములకు చెందిన ప్రవీణ్ కుమార్ (22) డ్రైవర్ గా పని చేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం అనారోగ్యంతో అతని తల్లిదండ్రులు కన్నుమూసారు. తన సోదరితో కలిసి అదే గ్రామంలోని అమ్మమ్మ లట్టిపల్లి యాదమ్మ ఇంట్లో ఉంటున్నాడు. 

కొంతకాలం క్రితం తన అక్కకు వివాహం చేశారు. బుధవారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ప్రవీణ్ కుమార్ ఉరేసుకొని మృతి చెందాడు. మనస్థాపంతో suicideకు పాల్పడ్డాడని మృతుని అమ్మమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపాడు.

కనగల్ :  కనగల్ మండలం చిన్నమ దారానికి చెందిన పిండి నర్సిరెడ్డి  (60) తన మామిడి తోటలో గురువారం సాయంత్రం ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడినట్లు స్థానికులు తెలిపారు. తన సోదరుడు సాయంత్రం మోటార్ పెట్టడానికి వెళ్లేసరికి చెట్టుకు వేలాడుతుండడంతో రోడ్డు వెంట వెళ్లే వారిని పిలిచి కిందికి దించగా అప్పటికే మృతి చెందాడు. బలవన్మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. గతంలో కూడా ఆత్మహత్యకు యత్నించినట్లు గ్రామస్తులు తెలిపారు.

మనస్తాపంతో చెరువులోకి దూకి..
కుమారుడు మృతి చెందాడని మనస్థాపానికి గురై వ్యక్తి బలవన్మరణానికి పాల్పడిన ఘటన గురువారం సూర్యాపేటలో వెలుగుచూసింది. టేకుమట్ల గ్రామానికి చెందిన కందుకూరి బ్రహ్మచారి (24) సూర్యాపేటలో కూలిపని చేసుకుంటూ జీవిస్తున్నాడు. బ్రహ్మచారి, రాజేశ్వరి దంపతులకు ఇటీవల కొడుకు పుట్టి, నవంబర్ 25న అనారోగ్య కారణాలతో మృతి చెందాడు. 

అప్పటినుంచి బ్రహ్మచారి బాధపడుతూ, మద్యం తాగుతూ అప్పుడప్పుడు పనికి వెళ్తున్నాడు. ఈనెల 3న కూడా పనికోసం సూర్యాపేటకు వచ్చాడు. అప్పటి నుంచి తిరిగి ఇంటికి వెళ్ళలేదు. దీంతో అప్పటినుంచి వెతుకుతుంటే..గురువారం సూర్యాపేటలోని సద్దుల చెరువులో బ్రహ్మచారి మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. రెండు రోజుల క్రితం చెరువులోకి దూకి బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేశామని ఇన్స్పెక్టర్ ఆంజనేయులు తెలిపారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా
Christmas Holidays : ఓరోజు ముందుగానే క్రిస్మస్ సెలవులు.. ఎప్పటివరకో తెలిస్తే ఎగిరిగంతేస్తారు..!