ఖైదీలు పోటీ చేయొచ్చు, కానీ ఓటు హక్కుండదు

By narsimha lode  |  First Published Nov 9, 2018, 3:10 PM IST

భారత రాజ్యాంగం ప్రకారంగా జైల్లో ఉన్నవారు  మాత్రం అసెంబ్లీ, లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే  అవకాశం ఉంది. 


హైదరాబాద్: భారత రాజ్యాంగం ప్రకారంగా జైల్లో ఉన్నవారు  మాత్రం అసెంబ్లీ, లేదా పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే  అవకాశం ఉంది. కానీ, జైల్లో శిక్షను అనుభవిస్తున్నవారంతా ఓటు హక్కును వినియోగించుకొనే అవకాశం లేదు.

 ఏదో ఒక  నేరం  చేసి తెలంగాణ రాష్ట్రంలోని పలు జైళ్లలో సుమారు 10 వేల మంది శిక్షను  అనుభవిస్తున్నారు. నేరాలు చేసి జైల్లో శిక్షను అనుభవిస్తున్న వారు ఓటింగ్‌లో పాల్గొనే  అవకాశం లేదు. శిక్ష ఖరారైన వారికి, విచారణ ఖైదీలకు ఓటు హక్కు లేదు. కానీ  జైల్లో ఉన్నా కూడ పోటీ చేసే అవకాశం మాత్రం ఉంటుంది.

Latest Videos

జైలు నుండి పోటీ చేసే వారి తరపున ఎవరైనా నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. జైలులో ఉన్నవారు పోటీ చేయడానికి కూడ కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఏ కేసులో కూడ పోటీ చేయాలనుకొంటున్నవారు  జ్యూడీషీయల్ విచారణలో ఉండకూడదు. 

శిక్ష ఖరారైన ఖైదీతో పాటు జైలులో ఉన్న వారెవరైనా కూడ ఎన్నికల్లో పోటీ చేసేఅవకాశం ఉంటుంది. జైలు నుండి పోటీ చేసినా తన ఓటును తనకు వేసుకొనే అవకాశం లేదు. 

click me!