ఫైజాన్ అహ్మద్ ఆత్మహత్యాయత్నం: 9 నెలలుగా అద్దెకు బెంజ్ కారు

By narsimha lodeFirst Published Jul 4, 2019, 6:11 PM IST
Highlights

ఔటర్ రింగ్ రోడ్డుపై ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి గురువారం నాడు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై ఫైజాన్ అహ్మద్ అనే వ్యక్తి గురువారం నాడు రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతను కేర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. యూఎస్ కన్సల్టెన్సీని ఆయన నిర్వహిస్తున్నాడు. ఆర్థిక సమస్యల కారణంగానే ఫైజాన్ అహ్మద్ ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా పోలీసులు చెబుతున్నారు.

హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డుపై కారులోనే ఆత్మహత్యాయత్నం చేసిన ఫైజాన్ అహ్మద్ గత ఏడాది అక్టోబర్ నుండి ఇదే కారును అద్దెకు తీసుకొన్నాడు. ప్రతి నెల ఈ కారుకు రెంటల్ ఏజెన్సీకి అద్దె చెల్లిస్తున్నాడు.

 యూఎస్ కన్సల్టెన్సీని  ఫైజాన్ అహ్మద్ నిర్వహిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకొన్నట్టుగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఔటర్ రింగ్ రోడ్డులో కారును నిలిపివేసి తన వెంట తెచ్చుకొన్న తుపాకీతో కాల్చుకొన్నాడు.

కారును ఎందుకు నిలిపివేశారో తెలుసుకొనేందుకు ట్రాఫిక్ పెట్రోలింగ్ పోలీసులు ఈ కారు వద్దకు వచ్చేసరికి ఫైజాన్ అహ్మద్ రక్తం మడుగులో ఉన్నాడు. వెంటనే కారు అద్దాలు ధ్వసం చేసి అతడిని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.  కేర్ ఆసుపత్రిలో అతనికి చికిత్స అందిస్తున్నారు.

సంబంధిత వార్తలు

ఖరీదైన కారులో వచ్చి ఆత్మహత్యాయత్నం
 

click me!