బొడిగె శోభ జాతకం మార్చిన కొబ్బరికాయ: మొక్కు తీర్చుకొన్న చొక్కారెడ్డి

By narsimha lodeFirst Published Dec 17, 2018, 4:39 PM IST
Highlights

 కరీంనగర్‌ జిల్లాలో ఓ కొబ్బరికాయ ఓ ఎమ్మెల్యే జీవితాన్ని మార్చేసింది. . తనను కొట్టకుండా అడ్డుకొన్న కొబ్బరికాయను  ముడుపు కట్టి మరీ మొక్కు తీర్చుకొన్నాడు ఓ నేత


కరీంనగర్: కరీంనగర్‌ జిల్లాలో ఓ కొబ్బరికాయ ఓ ఎమ్మెల్యే జీవితాన్ని మార్చేసింది. . తనను కొట్టకుండా అడ్డుకొన్న కొబ్బరికాయను  ముడుపు కట్టి మరీ మొక్కు తీర్చుకొన్నాడు ఓ నేత. తాను కోరుకొన్నట్టుగానే ఎమ్మెల్యే ఓటమి పాలు కావడంతో అదే కొబ్బరికాయను దేవుడి వద్ద కొట్టి తన పంతాన్ని నెగ్గించుకొన్నాడు ఆ నేత. 

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని  చొప్పదండి  అసెంబ్లీ నియోజకవర్గం నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా గత ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి భారీ మెజారిటీతో విజయం సాధించారు. ఈ దఫా ఆమెకు టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు.  ఆమెకు టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కకపోవడానికి కూడ కొన్ని కారణాలను చెబుతుంటారు.

చొప్పదండి  అసెంబ్లీ నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎస్సీ సామాజిక వర్గానికి ఈ నియోజకవర్గం రిజర్వ్ అయింది. అయినా అగ్రవర్ణాలకు చెందిన నేతలు రాజకీయాలను శాసిస్తారు.

శాసనసభ రద్దు కావడానికి ముందు  చొప్పదండి మండల కేంద్రంలో  అగ్నిమాపక కేంద్రం ప్రారంభోత్సవంతో పాటు మరికొన్ని శంకుస్థాపన కార్యక్రమాల్లో అప్పటి ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్, కరీంనగర్ ఎంపీ వినోద్‌ తో పాటు స్థానిక టీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా నిర్వహించిన పూజ కార్యక్రమంలో ఎంపీ వినోద్‌ కుమార్‌ అక్కడి మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ భర్త చొక్కారెడ్డి చేతికి కొబ్బరికాయ అందించి పూజలో కొట్టమని ఆహ్వానించారు. చొక్కారెడ్డి అంటే గిట్టని బొడిగె శోభ అతడిని నెట్టివేసి ఇతనికి కొబ్బరికాయ ఎవరిచ్చారంటూ పరుషంగా మాట్లాడారు. ఈ ఘటన టీఆర్ఎస్‌లో చర్చనీయాంశంగా మారింది.

బొడిగె శోభకు టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కలేదు. కేసీఆర్ అపాయింట్ మెంట్ కూడ ఇవ్వలేదు. దీంతో ఆమె బీజేపీలో చేరి ఆ పార్టీ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. శోభ స్థానంలో సుంకె రవిశంకర్‌కు  టీఆర్ఎస్ టిక్కెట్టు దక్కింది. రవిశంకర్  విజయం సాధించారు. రవిశంకర్  కొండగట్టు అంజనేయస్వామి వద్దకు వెళ్లి మొక్కు తీర్చుకొన్నారు.

రవిశంకర్ వెంట చొక్కారెడ్డి కూడ వెళ్లారు. చొక్కారెడ్డి తన వెంట కొబ్బరికాయను కూడ తెచ్చుకొన్నాడు. ఆనాడు ఎమ్మెల్యేగా శోభ తనను  కొట్టకుండా అడ్డుకొన్న కొబ్బరికాయను అంజన్నకు మొక్కుగా చెల్లించాడు. శోభ ఎమ్మెల్యే కాకుండా ఉండాలని  తాను కోరుకొన్న కోరిక నెరవేరినందుకు ముడుపు కట్టిన ఆనాటి కొబ్బరికాయను ఆదివారం నాడు కొండగట్టు ఆంజనేయస్వామికి సమర్పించాడు.


 

click me!