Kharagpur: ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించాడు. సదరు విద్యార్థి తెలంగాణకు చెందిన కే.కిరణ్ చంద్రగా గుర్తించారు. నాలుగో సంవత్సరం విద్యార్థి అనీ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు.
Telangana student found hanging at IIT Kharagpur: ఐఐటీ ఖరగ్ పూర్ విద్యార్థి బుధవారం హాస్టల్ గదిలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయిన స్థితిలో కనిపించాడు. సదరు విద్యార్థి తెలంగాణకు చెందిన కే.కిరణ్ చంద్రగా గుర్తించారు. నాలుగో సంవత్సరం విద్యార్థి అనీ, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. అతని మృతదేహాన్ని మొదట అతని స్నేహితులు గుర్తించి ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడు మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అసహజ మృతిగా కేసు నమోదు చేశారు.
ఈ ఘటనకు సంబంధించిన ప్రస్తుత వివరాలు ఇలా ఉన్నాయి.. పశ్చిమ బెంగాల్‌లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలోని ఖరగ్‌పూర్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ)లోని విద్యార్థుల హాస్టల్‌లో బుధవారం ఉదయం తెలంగాణకు చెందిన నాల్గవ సంవత్సరం విద్యార్థి మృతదేహాన్ని అనుమానాస్పద పరిస్థితుల్లో స్వాధీనం చేసుకున్నారు. మృతుడు ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థిని తెలంగాణ వాసి కే.కిరణ్ చంద్ర (21)గా గుర్తించారు. ఈ దురదృష్టకర సంఘటన గురించి తెలంగాణలోని కే.కిరణ్ చంద్ర తల్లిదండ్రులకు సమాచారం అందించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. మరణానికి కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదు, ఈ ఘటన ఇప్పుడు క్యాంపస్ లో కలకలం రేపుతోంది.
మృతుడు అతని హాస్టల్ రూంలో ఉరివేసుకుని ఉన్న స్థితిలో కనిపించాడు. మొదట చూసిన అతని స్నేహితులు వెంటనే ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లోని ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. ఈ ఘటనపై పోలీసులు అసహజ మరణంగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం మిడ్నాపూర్ మెడికల్ కాలేజీ & హాస్పిటల్‌కు తరలించారు. ఇది ఆత్మహత్యగా ప్రాథమికంగా భావించినప్పటికీ.. పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.
గత సంవత్సరం నుండి, IIT-ఖరగ్‌పూర్ క్యాంపస్‌లో విద్యార్థుల అనుమానాస్పద మరణాలతో వార్తల్లో నిలుస్తోంది. అక్టోబర్ 2022లో, ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌లో విద్యార్థి ఫైజాన్ అహ్మద్ అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించాడు. అతని విషయంలో కూడా, మృతదేహాన్ని హాస్టల్ గది నుండి స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారం కలకత్తా హైకోర్టు వరకు చేరింది. మళ్లీ ఈ ఏడాది జూన్‌లో మరో విద్యార్థి సూర్యా దిపెన్ మృతదేహాన్ని క్యాంపస్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు కిరణ్ చంద్ర సైతం అనుమానస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోయిన స్థితిలో మృతదేహం లభ్యమైంది.
(ఆత్మహత్య అన్ని సమస్యలకు పరిష్కారం కాదు. ఆత్మహత్యతో ఎవరూ ఏమీ సాధించలేరు. ఆత్మహత్య చేసుకోవాలనే ఆలోచన వస్తే వెంటనే వెంటనే ఆసరా హెల్ప్ లైన్ ( +91-9820466726) నెంబర్ కు కాల్ చేయండి. వారు కౌన్సిలింగ్ ఇచ్చి మీకు సహాయం చేస్తారు)