మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేసిన అభివృద్ది కార్యక్రమాలతో ప్రచారం నిర్వహించామన్నారు. కానీ బీజేపీకి చెప్పుకొనేందుకు ఏమీ లేదన్నారు. మునుగోడులో ఆశ్చర్యకరమైన మెజారిటీతో విజయం సాధిస్తామని కేటీఆర్ ధీమాను వ్యక్తం చేశారు.
హైదరాబాద్:మునుగోడులో మోసగాళ్లకు,మొనగాళ్లకు మధ్య పోటీ జరుగుతుందని తెలంగాణ మంత్రి కేటీఆర్ చెప్పారు.మంగళవారంనాడు హైద్రాబాద్ లోని తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలవాల్సిన అవసరం ఉందన్నారు. నల్లచట్టాలతో రైతులు, జీఎస్టీతో చేనేత కార్మికులకు బీజేపీ సర్కార్ అన్యాయం చేసిందని ఆయన విమర్శించారు. మునుగోడులో ఇప్పటివరనకు ఏం చేశామో,రానున్న రోజుల్లో ఏం చేస్తామో చెబుతూ ప్రచారం నిర్వహించామన్నారు.. కానీ మునుగోడులో మాత్రం చెప్పుకొనేందుకు బీజేపీకి ఏమీ లేదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు...ఏళ్ల తరబడి ఉన్న ఫ్లోరోసస్ సమస్యకు కూడ తమ ప్రభుత్వం పరిష్కారం చూపిందన్నారు.మతం పేరిట చిచ్చు పెట్టి రాజకీయం చేయడం అవసరమా అని ఆయన ప్రశ్నించారు. నీళ్లిచ్చిన పార్టీకి, కన్నీళ్లు ఇచ్చిన పార్టీకి మధ్య పోటీ జరుగుతుందన్నారు.
నిన్న తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ పై బీజేపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇవాళ పలివెలలో తమ పార్టీకి చెందిన నేతలపై దాడులు చేశారని ఆయన విమర్శించారు.నిరాశా , నిస్పృహలతోనే తమపై బీజేపీ శ్రేణులు దాడులకు దిగాయన్నారు. మునుగోడులో ఓడిపోతామనే భయంతో బీజేపీ ఈ దాడులకు పాల్పడిందన్నారు.బీజేపీ ఉద్దేశ్యపూర్వకంగా దాడులు చేసిందని ఆయన విమర్శించారు. బీజేపీ ప్రలోభాలకు లొంగవద్దని కేటీఆర్ ఓటర్లను కోరారు.మతం పేరిట చిచ్చు పెట్టే బీజేపీ రాజకీయాన్ని పరిశిలించాలని ఆయన ప్రజలను కోరారు.