మాది కుటుంబ సమస్య,ఎమ్మెల్యేల ఇంటికి నేనే వెళ్తా: మంత్రి మల్లారెడ్డి

By narsimha lode  |  First Published Dec 20, 2022, 10:48 AM IST

తనకు ఎవరితో గొడవలు లేవని  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి చెప్పారు.  తానే ఎమ్మెల్యేల  ఇంటికి వెళ్తానన్నారు. అంతేకాదు  అవసరమైతే వారిని తన ఇంటికి ఆహ్వానిస్తానని ఆయన చెప్పారు.


హైదరాబాద్:  తాను గాంధేయవాదినని  తెలంగాణ మంత్రి మల్లారెడ్డి  చెప్పారు. అంతేకాదు  తాను  ఎవరితో  గొడవ పెట్టుకునే రకం కూడా  కాదన్నారు.మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు నివాసంలో  బీఆర్ఎస్ కు చెందిన  ఎమ్మెల్యేలు  సమావేశమయ్యారు. మంత్రి మల్లారెడ్డి తీరుపై ఎమ్మెల్యేలు అసంతృప్తిని వ్యక్తం  చేశారు.ఈ పరిణామాలపై మంగళవారం నాడు  మంత్రి  మల్లారెడ్డి  మీడియాతో మాట్లాడారు.తమది  క్రమశిక్షణ గల పార్టీ అని  మంత్రి చెప్పారు.  ఎమ్మెల్యేలు  సమావేశాన్ని  తమ ఇంటి సమస్యగా  మంత్రి మల్లారెడ్డి  చెప్పారు.  ఈ సమస్యను  పరిష్కరించుకుంటామని  మంత్రి తెలిపారు.తానే ఎమ్మెల్యేల ఇంటికి  వెళ్తానన్నారు.అంతేకాదు  అవసరమైతే  ఎమ్మెల్యేలనే తాను తన ఇంటికి ఆహ్వానించనున్నట్టుగా  మంత్రి  మల్లారెడ్డి  చెప్పారు.

మేడ్చల్ మల్కాజిగిరి  జిల్లాలో పార్టీ పదవుల  విషయంలో  మంత్రి మల్లారెడ్డి తీరుపై  జిల్లాకు చెందిన  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు  తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. మార్కెట్  కమిటీ నియామకం విషయంలో  జిల్లాకు చెందిన  ఎమ్మెల్యేలు తమ అభ్యంతరాలు చెప్పారు.  కానీ  ఈ అభ్యంతరాలను పట్టించుకోకుండా  మల్లారెడ్డి తన  అనుచరులకే  ఈ పదవిని కట్టబెట్టారు. దీంతో  మల్లారెడ్డి తీరుపై  ఐదుగురు ఎమ్మెల్యేలు  నిన్న సమావేశమయ్యారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ,  కూకట్ పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు,  కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే  కేపీ వివేకానంద గౌడ్, ఉప్పల్ ఎమ్మెల్యే  భేతి సుభాష్ రెడ్డిలు  మల్కాజిగిరి ఎమ్మెల్యే  మైనంపల్లి హనుమంతరావు నివాసంలో  నిన్న సమావేశమయ్యారు. 

Latest Videos

also read:కార్యకర్తలకు నష్టమనే మాట్లాడుతున్నా: మంత్రి మల్లారెడ్డిపై మైనంపల్లి ఫైర్

పార్టీ కోసం కష్టపడిన  కార్యకర్తలకు  పదవులను  ఇప్పించలేకపోతున్నామని  ఎమ్మెల్యేలు ఆవేదన వ్యక్తం చేశారు. తన అనుచరులకే  మంత్రి మల్లారెడ్డి  నామినేటేడ్  పదవులను  కట్టబెట్టడంపై  ఎమ్మెల్యేలు  అసంతృప్తిని వ్యక్తం చేశారు.  మంత్రి మల్లారెడ్డి వల్లే  ఈ పరిస్థితి  నెలకొందని ఆరోపించారు.  
 

click me!