బీఆర్ఎస్ ఏర్పాటును స్వాగతిస్తున్నాం: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని

By narsimha lode  |  First Published Oct 6, 2022, 4:21 PM IST

బీజేపీకి వ్యతిరేకంగా కేసీఆర్ నిలబడుతారని సీపీఐ రాష్ట్రసమితికార్యదర్శికూనంనేని సాంబశివరావు చెప్పారు



హైదరాబాద్:  బీఆర్ఎస్ ను తాము స్వాగతిస్తున్నామని సీపీఐ రాష్ట్ర సమితి కార్యదర్శి  కూనంనేని సాంబశివరావు  చెప్పారు.గురువారం నాడు ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు. బీజేపీని వ్యతిరేకించే  పార్టీలకు తమ మద్దతుంటుందన్నారు.బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే వ్యక్తి కేసీఆర్ అని చెప్పారు. రాజ్యాంగాన్ని మార్చాలనే కుట్రలు జరుగుతున్నాయని ఆయన ఆరోపించారు. మతం పేరుతో దేశాన్ని చెడగొడుతున్నారన్నారు. 

టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మారుస్తూ టీఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం ఈ నెల  5 వ తేదీన తీర్మానం చేసింది.  జాతీయ రాజకీయాల్లోకి రావాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  ఈ మేరకు టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చారు. 

Latest Videos

undefined

బీఆర్ఎస్ పేరుతో దేశవ్యాప్తంగా పర్యటించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.  మహారాష్ట్ర నుండి కేసీఆర్ పర్యటనలు ప్రారంభించనున్నారు.  ఢిల్లీలో ఈ ఏడాది డిసెంబర్ 9వతేదీన బీఆర్ఎస్ తరపున భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ సభ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడ సభ ఏర్పాటుకు కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. 

ప్రస్తుతం మునుగోడు అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో  టీఆర్ఎస్ కు సీపీఐ, సీపీఎం మద్దతు ప్రకటించాయి. బీజేపీని ఓడించేందుకుగాను ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు మద్దతివ్వాలని నిర్ణయం తీసుకున్నామని లెఫ్ట్ పార్టీలు ప్రకటించాయి.

also read:టీఆర్ఎస్ పేరు బీఆర్ఎస్ గా మార్పు: సీఈసీకి తీర్మానం అందజేత

ఈ ఏడాది ఆగస్టు 20వ  తేదీన మునుగోడులో జరిగిన బహిరంగ సభలో సీపీఐ నేతలు టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటిస్తున్నట్టుగా తెలిపారు. టీఆర్ఎస్ సభలో టీఆర్ఎస్ రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి పాల్గొన్నారు.మునుగోడులో టీఆర్ఎస్ అభ్యర్ధి విజయంసాధించేందుకు అనుసరించాల్సిన వ్యూహంపై ఇవాళ నల్గొండ జిల్లాకు చెందిన లెఫ్ట్ పార్టీల నేతలతో టీఆర్ఎస్ నాయకత్వం చర్చించింది. 

కార్పోరేట్ శక్తులను  కాపాడుతున్న మోడీ:సీపీఐ నారాయణ

దేశానికి ప్రమాదమని పీఎఫ్ఐ ని బ్యాన్ చేశారని సీపీఐ జాతీయ కార్యదర్శినారాయణ చెప్పారు. ఇవాళ ఆయన హైద్రాబాద్ లో మీడియాతో మాట్లాడారు.భజరంగ్ దళ్ కూడా దేశానికి ప్రమాదమేనని ఆయన అభిప్రాయపడ్డారు. బీజేపీకి వ్యతిరేకంగా ఉంటే దాడులుచేస్తున్నారని ఆయన విమర్శించారు. మోడీకార్పోరేట్ శక్తులను కాపాడుతున్నారని ఆయన విమర్శించారు. ఆంధ్రప్రదేశ్  గంజాయ్ కి హబ్ గా మారిందన్నారు.

click me!