సామాజిక న్యాయం మాతోనే, 'రెడ్డి' సామాజికవర్గం పంచాయితీపై నో కామెంట్: జగ్గారెడ్డి

Published : Jun 01, 2022, 12:46 PM IST
 సామాజిక న్యాయం మాతోనే, 'రెడ్డి' సామాజికవర్గం పంచాయితీపై  నో కామెంట్: జగ్గారెడ్డి

సారాంశం

సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. ఇవాళ హైద్రాబాద్ లో ఆయన మీడియాతో మాట్లాడారు.  

హైదరాబాద్: తమ పార్టీ సామాజిక న్యాయాన్ని పాటిస్తుందని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ Jagga Reddy చెప్పారు.బుధవారం నాడు జగ్గారెడ్డి Hyderabad లో మీడియాతో మాట్లాడారు.  Reddy  సామాజిక వర్గం విషయమై తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయలేనని కూడా ఆయన ప్రకటించారు. తెలంగాణలో ఏ పార్టీతో కూడా పొత్తులుండవని Rahul Gandhi ప్రకటించిన విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు. రెడ్డి సామాజిక వర్గంపై టీపీసీసీ చీఫ్ Revanth Reddy  కీలక వ్యాఖ్యలు చేశారు.కుల, మతాల ను రెచ్చగొట్టి రాజకీయంగా లబ్దిపొందే పార్టీ కాంగ్రెస్ కాదని ఆయన గుర్తు చేశారు.

ఈ నెల 22న రేవంత్ రెడ్డి  రెడ్డి సామాజిక వర్గంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపాయి. పలువురు నేతలు ఈ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఎఐసీసీ సెక్రటరీ మధు యాష్కీ ఈ వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. ఈ వ్యాఖ్యలపై పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని కూడా వి. హనుమంతరావు తెలిపారు. మరో వైపు ఈ వ్యాఖ్యల విషయంలో తాను వ్యాఖ్యలు చేయనని జగ్గారెడ్డి గతంలోనే ప్రకటించారు. తాను అన్ని వర్గాల నాయకుడిగా ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపై గాంధీ భవన్ వేదికగా ఎఐసీసీ కార్యక్రమాల  అమలు  కమిటీ చైర్మెన్ ఏలేటీ మహేశ్వర్ రెడ్డి తీవ్రంగా తప్పు బట్టారు.

మీ పార్టీలు గెలవాలన్నా రాజకీయం చేయాలన్నా మీ పార్టీలను రెడ్ల చేతిలో పెట్టాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సూచించారు. రెడ్లను దూరం చేసినందుకు ప్రతాప రుద్రుడు ఓడిపోయి పతనమయ్యాడని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రెడ్లకు అవకాశం ఇవ్వండి రాజకీయ పార్టీలు ఎట్లా గెలవవో చూస్తానంటూ సవాల్ విసిరారు. 

రెడ్లను నమ్ముకున్నోడు ఎవడూ మోసపోలేదు, నష్టపోలేదన్నారు. ఆనాడు రెడ్డి బిడ్డ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 32 మంది ఎంపీలను గెలిపించారు కాబట్టే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని రేవంత్ రెడ్డి గుర్తుచేశారు. రాజకీయంగా ఇప్పుడు రెడ్లు నిర్లక్ష్యానికి లోనవుతున్నారన్నారని.. దీనికి కారణం రెడ్లు వ్యవసాయం మానేసి బడుగులు, బలహీన వర్గాలకు దూరం అవ్వడమేనని ఆయన అభిప్రాయపడ్డారు. 

also read:టీపీసీసీలో చిచ్చు పెట్టిన ‘రెడ్డి’ వ్యాఖ్యలు.. రేవంత్‌పై సొంత పార్టీ నేతల విమర్శలు, ఠాగూర్ సీరియస్

వ్యవసాయం వదిలేసి అందరికీ దూరం అవుతున్నామని  రెడ్డి సోదరులు వ్యవసాయం వదలొద్దని ఆయన సూచించారు. కాకతీయ సామ్రాజ్యం లో ప్రతాప రుద్రుడు వచ్చాక రెడ్డి సామంత రాజులను పక్కన పెట్టేసి పద్మనాయకులను దగ్గరికి తీశాడని రేవంత్ గుర్తుచేశారు. పద్మ నాయకులు అంటే వెలమలని, రెడ్లను పక్కన పెట్టి..వెలమలను దగ్గరికి తీయడంతో కాకతీయ సామ్రాజ్యం కూలిపోయిందన్నారు. ఆనాటి నుండి.. ఈనాటి వరకు రెడ్లకు, వెలమలకు పొసగదన్నారు రేవంత్ రెడ్డి.

PREV
click me!

Recommended Stories

Telangana Rising Global Summit : తొలి రోజు రూ.1.88 లక్షల కోట్ల పెట్టుబడులు.. వేల ఉద్యోగాలు
Telangana Rising గ్లోబల్ సమ్మిట్ తో కలిగే మార్పులు, లాభాలు ఏమిటి?