నకిలీ మద్యం వెనుక ఎవరున్నా ఉపేక్షించం: మంత్రి శ్రీనివాస్ గౌడ్

By narsimha lode  |  First Published Dec 20, 2022, 1:22 PM IST

ఒడిశాలో అక్రమ మద్యం తయారీ యూనిట్ ను ధ్వంసం చేసిన ఎక్సైజ్ శాఖాధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్  అభినందించారు.నకిలీ మద్యాన్ని తాము ఉపేక్షించబోమన్నారు.నకిలీ మద్యం తయారీ వెనుక ఎవరున్నా కూడా ఉపేక్షించబోమన్నారు.


హైదరాబాద్: ఒడిశాలో అక్రమ మద్యం తయారీ యూనిట్ ను  ధ్వంసం చేసిన  ఎక్సైజ్ శాఖాధికారులను మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభినందించారు. మంగళవారంనాడు తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైద్రాబాద్ లో  మీడియాతో మాట్లాడారు.ఉమ్మడి ఏపీ రాష్ట్రంలో  ఇతర రాష్ట్రాల నుండి  మద్యం తీసుకువచ్చి విక్రయించేవారన్నారు.ఎప్పటికప్పుడు  తమ శాఖ అధికారులు అప్రమత్తంగా  ఉన్నందునే అక్రమ మద్యాన్ని అరికట్టగలిగినట్టుగా  ఆయన చెప్పారు. పకడ్బందీ చర్యలు తీసుకున్నందునే  ఎక్సైజ్ శాఖ ఆదాయం కూడా పెరిగిందని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.నకిలీ మద్యం తయారీ విషయం తమకు  ఈ నెల  16వ తేదీన సమాచారం వచ్చిందన్నారు మంత్రి. 

నకిలీ మద్యం విషయంలో ఎంతటివారున్నా  ఉపేక్షించవద్దని  తాను అధికారులకు సూచించినట్టుగా తెలిపారు.ఈ విషయమై  ఎవరూ ఫోన్ చేసినా  రికార్డు చేయాలని కోరినట్టుగా చెప్పారు. నకిలీ మద్యంతో ఆర్ధికంగా  తీవ్రమైన నష్టమని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు. ఒడిశాలోని అటవీ ప్రాంతంలో  నకిలీ మద్యం తయారు చేస్తున్నారని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  వివరించారు. ప్రాణాలకు తెగించి  తెలంగాణ ఎక్సైజ్ అధికారులు  నకిలీ మద్యం యూనిట్  ను  ధ్వంసం చేశారన్నారు. 

Latest Videos

undefined

 గుడుంబాను అరికట్టాలని సీఎం ఆదేశిస్తే ఏడాది లోపుగానే  గుడుంబా తయారీని  అరికట్టిన విషయాన్ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ గుర్తు చేశారు.  నకిలీ మద్యానికి సంబంధించి  ఒక బాటిల్ పై అనుమానం వచ్చి న సీఐ  విచారణను ప్రారంభిస్తే  ఒడిశాలో  నకిలీ మద్యం తయారీ కేంద్రం  బయటపడిందని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.మద్యం బాటిల్స్, అట్టపెట్టెలపై ఉన్న బార్ కోడ్ ల విషయంలో అనుమానాలు రాకుండా  నకిలీ మద్యం తయారీదారులు జాగ్రత్తలు తీసుకున్నారని మంత్రి చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం తయారైనట్టుగా  భ్రమ కల్పించేలా జాగ్రత్తలు తీసుకున్నారన్నారు. గతంలో  చిన్న కేసైనా దాని వెనుక పెద్ద తలకాయలు రంగంలోకి దిగేవారన్నారు.దీంతో కేసులు మాఫీ చేసేవారని మంత్రి శ్రీనివాస్ గౌడ్  గుర్తు చేశారు.

also read:మునుగోడు ఉపఎన్నికలో నకిలీ మద్యం సరఫరా: ఒడిశాలో లిక్కర్ బాట్లింగ్ యూనిట్ గుర్తింపు

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత  ఈ మాఫియాకు  చెక్ పెట్టడంతో  ఎక్సైజ్ శాఖ ఆదాయం పెరిగిందని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  తెలిపారు.అక్రమాలను తాము సహించబోమని  మంత్రి శ్రీనివాస్ గౌడ్  చెప్పారు.  నకిలీ మద్యం కేసుకు సంబంధించి  బాటిల్స్ లేబుల్స్ ఎక్కడ తయారు చేశారనే విషయమై  దర్యాప్తు చేస్తామని  మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

click me!