అంతర్గత అంశాలపై చర్చ, అసంతృప్తి లేదు: కోమటిరెడ్డితో భేటీ తర్వాత ఠాక్రే

By narsimha lode  |  First Published Sep 6, 2023, 3:57 PM IST


భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలాంటి అసంతృప్తితో లేరని  కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ మాణిక్ రావు ఠాక్రే  చెప్పారు.


హైదరాబాద్: పార్టీ అంతర్గత అంశాలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారని  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జీ  మాణిక్ రావు  ఠాక్రే చెప్పారు.అసంతృప్తితో ఉన్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి మాణిక్ రావు ఠాక్రే, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్కలు  బుధవారంనాడు వెళ్లారు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించారు. సుమారు రెండు గంటల పాటు చర్చలు ముగిశాయి. ఈ సమావేశం ముగిసిన తర్వాత  మాణిక్ రావు ఠాక్రే మీడియాతో మాట్లాడారు.  

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఎలాంటి అసంతృప్తితో లేరన్నారు.  తనను మధ్యాహ్న భోజనానికి వెంకట్ రెడ్డి ఆహ్వానించారన్నారు. గతంలో తనను  బ్రేక్ ఫాస్ట్ కు పిలిచారు. ఇవాళ లంచ్ కు ఆహ్వానిస్తే  వెంకట్ రెడ్డి ఇంటికి వచ్చినట్టుగా  ఠాక్రే తెలిపారు.  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  కాంగ్రెస్ పార్టీలో పెద్ద నాయకుడు అని ఆయన  చెప్పారు. మధ్యాహ్న భోజన సమయంలో  పార్టీ విషయాలపై  సుదీర్ఘంగా  చర్చించామని  ఆయన  తెలిపారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  ఎలాంటి అసంతృప్తితో లేరని ఆయన  తేల్చి చెప్పారు.

Latest Videos

also read:అసంతృప్తితో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి: బుజ్జగిస్తున్న పార్టీ నేతలు

పార్టీకి సంబంధించిన ప్రణాళికలపై సూచనలు, అభిప్రాయాలను కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి  చెప్పారని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు.కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారనేది  తప్పుడు  ప్రచారమన్నారు. తమను  భోజనానికి పిలిస్తే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి నివాసానికి చేరుకున్నట్టుగా  ఆయన చెప్పారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన్ నర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అని ఆయన గుర్తు చేశారు.

పార్టీ పదవుల నియామకంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తితో ఉన్నారని ప్రచారం సాగుతుంది. సీడబ్ల్యూసీలో చోటు దక్కుతుందని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భావించారు. కానీ ఆయనకు ఈ పదవి దక్కలేదు.  కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీలో కూడ చోటు దక్కలేదు. ఈ పరిణామాలు  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అసంతృప్తికి గురి చేసినట్టుగా చెబుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న  కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తో  ఎఐసీసీ సెక్రటరీ  సంపత్ కుమార్ చర్చలు జరిపారు.  సంపత్ కుమార్ తో చర్చలు జరిపే సమయంలోనే  కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ  మాణిక్ రావు ఠాక్రే  వెళ్లారు.  ఠాక్రే తర్వాత సీఎల్పీ నేత భట్టి విక్రమార్క కూడ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇంటికి చేరుకున్నారు. 

click me!