టీఆర్ఎస్ కే మా మద్దతు: తెలంగాణలో కాంగ్రెస్ కు హ్యాండిచ్చిన టీడీపీ

By Nagaraju penumalaFirst Published 23, Feb 2019, 1:02 PM IST
Highlights

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మాట్లాడుతూ తమ మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికేనని తేల్చి చెప్పారు. బడ్జెట్‌లో పేర్కొన్న ప్రాధాన్యతాంశాలను అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 
 
హైదరాబాద్: తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు. ప్రజా కూటమి తరపున పోటీచేసి సత్తుపల్లి నియోజకవర్గం నుంచి గెలుపొందిన సండ్ర అసెంబ్లీ సమావేశాల్లో కీలక వ్యాఖ్యలు చేశారు. 

సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై మాట్లాడుతూ తమ మద్దతు టీఆర్ఎస్ ప్రభుత్వానికేనని తేల్చి చెప్పారు. బడ్జెట్‌లో పేర్కొన్న ప్రాధాన్యతాంశాలను అమలు చేసేందుకు టీఆర్ఎస్ ప్రభుత్వానికి తమ మద్దతు ఉంటుందని హామీ ఇచ్చారు. 

టీఆర్ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేస్తారని ప్రజలు విశ్వసించారు కాబట్టే రెండోసారి అధికారంలోకి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రధానంగా గురుకుల విద్యాలయ వ్యవస్థ, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ అమలుతో పాటు రైతు బంధు పథకంపై ప్రశంసలు కురిపించారు. 

ఆ పథకాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని కోరారు. దళితుల కోసం ప్రత్యేకంగా యూనివర్శిటీ ఏర్పాటు చేయాలని, సబ్ ప్లాన్ అమలు కోసం రాష్ట్రంలోని అన్ని పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం సమావేశం నిర్వహించాలని కోరారు. సత్తుపల్లి, అశ్వారావుపేట నియోజకవర్గాలను కలిపి కొత్త జిల్లాను ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని సండ్ర వెంకట వీరయ్య విజ్ఞప్తి చేశారు. 
 
Last Updated 23, Feb 2019, 1:02 PM IST