అసెంబ్లీలో కాంగ్రెస్‌ ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు కేసీఆర్ కౌంటర్

By narsimha lodeFirst Published Feb 23, 2019, 12:27 PM IST
Highlights

ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రసంగానికి సీఎం కేసీఆర్  కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన  ఎండగట్టారు

హైదరాబాద్: ఓటాన్‌ అకౌంట్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ప్రసంగానికి సీఎం కేసీఆర్  కౌంటరిచ్చారు. కాంగ్రెస్ పార్టీ తీరును ఆయన  ఎండగట్టారు. గత పాలకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని ఆయన మండిపడ్డారు.

శనివారం నాడు తెలంగాణ అసెంబ్లీలో ఓటాన్ బడ్జెట్‌పై చర్చ సందర్భంగా  కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు టీఆర్ఎస్‌పై విమర్శలు గుప్పించారు. స్థానిక సంస్థలను టీఆర్ఎస్ సర్కార్  నిర్వీర్యం చేస్తోందని  ఆయన విమర్శించారు. జగిత్యాల మున్సిపాలిటీకి రూ. 2 కోట్ల బకాయిలు ఉన్నాయని  ఆయన చెప్పారు.

శ్రీధర్ ప్రసంగానికి తెలంగాణ సీఎం కేసీఆర్  అడ్డుపడ్డారు.బడ్జెట్‌లో పంచాయితీలకు నిధులు కేటాయించలేదని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే శ్రీధర్ బాబు అవాస్తవాలను చెబుతున్నారని ఆయన విమర్శించారు.  

గత పాలకులు స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశాయని ఆయన ఆరోపించారు. గత పాలకులు పంచాయితీరాజ్ సంస్థలను  బాగు చేస్తే  తాము చెడగొట్టామా అని ఆయన ప్రశ్నించారు. పంచాయితీ రాజ్ సంస్థలను బలోపేతం చేసే ఉద్దేశ్యంతోనే తాము  పంచాయితీ రాజ్ చట్టానికి సవరణలు తీసుకొచ్చినట్టుగా కేసీఆర్  చెప్పారు. గత పాలకుల హయంలో ఎన్ని మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి అయిందని ఆయన ప్రశ్నించారు. 

click me!