మోరంచపల్లి వాసులకు ఆహారం, నీళ్లు సరఫరా: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు

By narsimha lode  |  First Published Jul 27, 2023, 9:47 AM IST

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మోరంచపల్లివాసులకు  సహాయం అందించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  చెప్పారు.


వరంగల్: ఉమ్మడి వరంగల్ జిల్లాలోని  మోరంచపల్లివాసులకు హెలికాప్టర్ ద్వారా సహాయం చేసే ప్రయత్నం చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు.. మోరంచపల్లి గ్రామానికి  స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి గ్రామానికి  చేరుకున్నారని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  చెప్పారు.గ్రామస్తులకు  నీళ్లు, ఆహారం అందించే ప్రయత్నాలు చేస్తున్నామన్నారు.

ములుగు, వరంగల్ నుండి బోట్లు తెప్పిస్తున్నట్టుగా  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలిపారు.హెలికాప్టర్ ద్వారా సాయం అందించేయత్నం చేస్తున్నామన్నారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో  హెలికాప్టర్ కు విమానాయానశాఖ అధికారులు ఇంకా అనుమతి ఇవ్వలేదని మంత్రి చెప్పారు. హెలికాప్టర్ రాకపోకలకు అనుమతిని ఇస్తే   సహాయక చర్యలను మరింత ముమ్మరం చేస్తామని  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  చెప్పారు.

Latest Videos

భారీ వర్షాల కారణంగా మోరంచపల్లి వాగుకు వరద పోటెత్తింది. దీంతో  ఈ నీరు  మోరంచపల్లిని ముంచెత్తింది.  మోరంచపల్లి వాగు వరద నీటిలో  ఇళ్లు నీట మునిగాయి.  దీంతో స్థానికులు  ఇళ్లపైన నిలబడి  సహాయం కోసం ఎదురుచూస్తున్నారు. మరికొందరు  చెట్టుపై ఎక్కి  సహాయం కోసం  చూస్తున్నారు.

వరంగల్ జిల్లాలో వరదపై  మంత్రి సమీక్ష

ఉమ్మడి వరంగల్ జిల్లాలో  వరద  పరిస్థితులపై  మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు  అధికారులతో సమీక్షించారు.తాజా పరిస్థితులపై ఎప్పటికప్పుడు స్థానిక ప్రజా ప్రతినిధులు, కలెక్టర్లు, సీపీ, ఎస్పీ, సంబధిత అధికారులతో మంత్రి మాట్లాడారు. వెంటనే సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను మంత్రి ఆదేశించారు. వరదల్లో చిక్కుకుపోయిన వారిని రక్షిస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. వరద బాధితులు అధైర్య పడొద్దని  మంత్రి కోరారు.  

ప్రభుత్వం అన్ని చర్యలు  తీసుకుంటుందని  మంత్రి తెలిపారు.  ముంపు ప్రాంతాల ప్రజలకు ఆహారం, నీరు అందిస్తున్నట్టుగా ఆయన  చెప్పారు.అంతేకాదు పునరావాస ఏర్పాట్లు చేశామని మంత్రి వివరించారు.  వరదల్లో చిక్కుకున్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని  మంత్రి అధికారులను ఆదేశించారు. అత్యవసరమైన పరిస్థితుల్లో తప్ప బయటకు రావద్దని ఆయన ప్రజలను కోరారు. వరద బాధితుల కోసం అన్ని జిల్లాల్లో టోల్ ఫ్రీ నంబర్లను ఏర్పాటు  చేయాలని మంత్రి సూచించారు.


 

 

 

click me!