మీడియాలో వార్తలు: పార్టీ మార్పుపై తేల్చేసిన కేఎల్ఆర్, ప్రసాద్

By narsimha lodeFirst Published Sep 7, 2018, 2:52 PM IST
Highlights

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ప్రసాద్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే  కేఎల్ఆర్‌లు కూడ టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. 


హైదరాబాద్: ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు చెందిన మాజీ మంత్రి  ప్రసాద్, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే  కేఎల్ఆర్‌లు కూడ టీఆర్ఎస్‌లో చేరుతారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారానికి భిన్నంగా  శుక్రవారం నాడు గాంధీభవన్‌లో జరిగిన కాంగ్రెస్ పార్టీ కార్యవర్గ సమావేశానికి ఈ ఇధ్దరు నేతలు హాజరయ్యారు.

మాజీ మంత్రి ప్రసాద్,  మేడ్చల్ మాజీ ఎమ్మెల్యేకేఎల్ఆర్‌లతో కూడ మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారని మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే  ఈ వార్తలను వీరిద్దరూ కూడ ఖండించారు.  

కాంగ్రెస్ పార్టీలో కొత్తగా చేరిన వారు ఈ రకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని  గాంధీభవన్ లో  మీడియా సమావేశం ఏర్పాటు చేసీ కేఎల్ఆర్, ప్రసాద్ లు ఖండించారు.

ఉద్దేశ్యపూర్వకంగానే తమపై  ప్రచారం చేస్తున్నారని  వారు ఆరోపించారు.  కాంగ్రెస్ పార్టీలోనే తాము కొనసాగుతామని  చెప్పారు.  కాంగ్రెస్ పార్టీలోనే తమకు టిక్కెట్లు వస్తాయని  విజయం సాధిస్తామని కూడ  ధీమాను వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీని వీడాల్సిన అవసరం తమకు లేదని వారు ప్రకటించారు. 
 

click me!