ఆర్టీసీ సమ్మె: హౌస్ మోషన్ పిటిషన్‌‌పై విచారణ

By narsimha lodeFirst Published Oct 6, 2019, 5:54 PM IST
Highlights

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో దాఖలైన హౌస్ మోషన్ పిటిషన్ పై  హైకోర్టు లో ఆదివారం నాడు విచారణ సాగుతోంది.


హైదరాబాద్: ఆర్టీసీ సమ్మెను విరమింపజేసేందుకు  చర్యలు తీసుకోవాలని ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్ దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్‌పై  ఆదివారం నాడు సాయంత్రం  నాలుగు గంటలకు  విచారణ ప్రారంభమైంది.

ఓయూ విద్యార్ధి సుదేంద్రసింగ్  ఆదివారం నాడు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు విచారణకు స్వీకరించింది.దీంతో సాయంత్రం నాలుగు గంటలకు జస్టిస్ రాజశేఖర్ రెడ్డి ఇంట్లో వాదనలు ప్రారంభమయ్యాయి.

ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం  ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నం చేసిందని  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. సమ్మె కారణంగా ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు తీసుకొన్న విషయాన్ని  ప్రభుత్వ తరపు న్యాయవాది హైకోర్టుకు వివరించారు.

ఆర్టీసీ కార్మికుల కోసం ప్రభుత్వం ఏ రకమైన చర్యలు తీసుకొన్న విషయాలను ప్రభుత్వ న్యాయవాది దృష్టికి తీసుకెళ్లారు. ఈ నెల 5వ తేదీ నుండి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లారు. తమ డిమాండ్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగా స్పందించలేదని జేఎసీ నేతలు ఆరోపిస్తున్నారు.
 

click me!