ఈఎస్ఐ స్కాం: ఫార్మసిస్టు నాగలక్ష్మి అరెస్ట్

By narsimha lodeFirst Published Oct 6, 2019, 4:02 PM IST
Highlights

ఈఎస్ఐ స్కాం లో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.ఈ కేసుతో సంబంధం ఉన్నవారిని వడలడం లేదు.

హైదరాబాద్:ఈఎస్ఐ కుంభకోణంలో  ఏసీబీ అధికారులు అరెస్టులు చేస్తూనే ఉన్నారు. ఫార్మా కంపెనీ ఎండి సుధాకర్ రెడ్డితో కలిసి అక్రమాలకు పాల్పడినట్టు అభియోగాలతో సనత్‌నగర్ ఈఎస్ఐ ఆసుపత్రిలో ఫార్మాసిస్ట్‌గా పనిచేస్తున్న నాగలక్ష్మిని అరెస్ట్ చేశారు.

ఎనిమిదిన్నర కోట్ల రూపాయాల మందుల కొనుగోలు వ్యవహారంలో ఆమె పాత్ర ఉందని తెలుస్తోందని ఫార్మా కంపెనీ ఎండీ సుధాకర్, నాగలక్ష్మి కలిసి పెద్ద మొత్తంలో అక్రమాలకు పాల్పడినట్టుగా ఏసీబీ గుర్తించింది. ఈ అరెస్ట్‌తో ఇప్పటివరకు ఈఎస్ఐ కుంభకోణంలో అరెస్టైన వారి సంఖ్య 10కి చేరింది.

లైఫ్‌ కేర్ డ్రగ్స్ ఎండీ సుధాకర్ రెడ్డిని అవినీతి ఆరోపణలతో పాటు కుంభకోణంలో ఇతరులతో కుమ్మక్కయ్యారనే అభియోగాలతో శనివారం నాడు అరెస్ట్ చేసింది. డైరెక్టర్, అసిస్టెంట్ డైరెక్టర్ ఇతర అధికారులతో కలిసి కుట్ర పన్నినట్టుగా  ఏసీబీ అధికారులు చెప్పారు.

రూ. 8.25 కోట్ల మందుల కొనుగోలు ఆర్డర్‌ను  సుధాకర్ రెడ్డి సంపాదించినట్టుగా ఏసీబీ అధికారులు పేర్కొన్నారు. ఈఎస్ఐ స్కాంలో ఏసీబీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. 

click me!