టికెట్ల కేటాయింపులో సామాజిక న్యాయం పాటించాం: టీఆర్ఎస్ నేత పల్లా

By narsimha lodeFirst Published Nov 20, 2020, 11:35 AM IST
Highlights

 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని  సామాజికవర్గాలకు న్యాయం చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.
 

హైదరాబాద్: జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తమ పార్టీ అన్ని  సామాజికవర్గాలకు న్యాయం చేసిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు.

శుక్రవారం నాడు ఆయన తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో 150 సీట్లలో 84 స్థానాల్లో బీసీలకు కేటాయించినట్టుగా ఆయన గుర్తు చేశారు.మరాఠి తదితర ఇతర భాషలు మాట్లాడేవారికి కూడ 10 టికెట్లు కేటాయించినట్టుగా ఆయన తెలిపారు. 

హైద్రాబాద్ లో భారీ వర్షాలు పడితే వరద ప్రభావిత ప్రాంతాల్లో  తమ పార్టీకి చెందిన మంత్రులు పర్యటించి బాధితులను ఓదార్చినట్టుగా ఆయన చెప్పారు.తమ ప్రభుత్వం అధికారంలో ఉన్న చోట్ల తెలంగాణ రాష్ట్రంలో అవలంభిస్తున్న సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారా అని ఆయన ప్రశ్నించారు.

జీహెచ్ఎంసీలో వరద బాధితులకు రూ. 25 వేలు ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. తప్పుడు ప్రచారంతో రాజకీయంగా లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ఆయన పరోక్షంగా బీజేపీపై పల్లా రాజేశ్వర్ రెడ్డి విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన గుర్తు చేశారు.
 

click me!