టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేను అడ్డుకున్న ప్రజలు....తీవ్ర ఉద్రిక్తత

By Arun Kumar PFirst Published Oct 16, 2018, 3:36 PM IST
Highlights

మరో రెండు నెలల్లో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ప్రముఖ రాజకీయ పార్టీలన్ని ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో దూకుడు ప్రదర్శిస్తోంది. ఇప్పటికే పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థులను ప్రకటించిన గులాబీ బాస్ వారంతా నియోజకవర్గాల్లోనే ఉంటూ ప్రచారం చేయాలని ఆదేశించారు. దీంతో అభ్యర్థులు ప్రచార కార్యక్రమాల్లో మునిగిపోయారు.

అయితే కొన్ని చోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల నుండి తిరుగుబాటు ఎదురవుతోంది. ఇటీవలే మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ ఓ గ్రామంలో ప్రచారానికి వెళ్లగా అక్కడి ప్రజలు అడ్డుకున్న విషయం తెలిసింందే. అలాంటి చేదు అనుభవమే మరో మాజీ ఎమ్మెల్యేకు ఎదురయ్యింది.

యాదాద్రి భువనగిరి జిల్లా మునుగోడు నియోజకవర్గానికి చెందిని తాజా మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టీఆర్ఎస్ పార్టీ నుండి మరోసారి ఎమ్మెల్యేగా పోటీచేసే అవకాశం అభించింది. దీంతో ఆయన నియోజకవర్గ పరిధిలోని గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇలా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన చౌటుప్పల్ మండలంలోని పతంగి గ్రామానికి వెళ్లాడు. అయితే ఆయనను గ్రామంలో ప్రవేశించకుండా గ్రామస్తులు అడ్డుకోవడంతో తీవ్ర ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది.

తమ గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించకుండా ప్రభుత్వం, ఎమ్మెల్యే విఫలమయ్యాడంటూ గ్రామంలోని కొందరు యువకులు ఆయన వాహనాన్ని అడ్డుకోడానికి  ప్రయత్నించారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ కార్యకర్తలకు, గ్రామస్తులకు మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. పరిస్థితి కాస్త ఉద్రిక్తంగా మారడంతో రంగంలోకి దిగిన పోలీసులు గ్రామస్తులను, టీఆర్ఎస్ కార్యకర్తలను సముదాయించి అక్కడి నుండి పంపించారు.  
   
click me!