వికారాబాద్ కిడ్నాప్ : తానే భర్తతో వెళ్లానంటున్న దీపిక.. నిజాలు రాబడుతున్న పోలీసులు

Siva Kodati |  
Published : Sep 29, 2020, 06:38 PM IST
వికారాబాద్ కిడ్నాప్ : తానే భర్తతో వెళ్లానంటున్న దీపిక.. నిజాలు రాబడుతున్న పోలీసులు

సారాంశం

వికారాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన దీపిక మిస్టరీ వీడింది. దీపికను పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె భర్త అఖిల్ తీసుకెళ్లాడు. అయితే తాను ఇష్టపూర్వకంగానే భర్త వెంట వెళ్లానని, గతంలో పోలీసులకు తెలిపింది దీపిక.

వికారాబాద్‌లో కిడ్నాప్‌కు గురైన దీపిక మిస్టరీ వీడింది. దీపికను పక్కా ప్లాన్ ప్రకారమే ఆమె భర్త అఖిల్ తీసుకెళ్లాడు. అయితే తాను ఇష్టపూర్వకంగానే భర్త వెంట వెళ్లానని, గతంలో పోలీసులకు తెలిపింది దీపిక.

అయితే ఆమె ఇష్టపూర్వకంగా వెళ్లిందా..? లేదా బలవంతంగా తీసుకెళ్లారా అన్న కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. కిడ్నాప్ తర్వాత సిద్ధిపేట జిల్లా కొడగండ్లలో అఖిల్, దీపిక షెల్టర్ తీసుకున్నారు.

ప్రస్తుతం వికారాబాద్ డీఎస్పీ కార్యాలయంలో అఖిల్, దీపికలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇస్తున్నారు. ఆమె ఇష్టపూర్వకంగా వెళ్లుంటే మాత్రం కౌన్సెలింగ్ తర్వాత భర్త అఖిల్ వద్దకే పంపనున్నారు.. ఇలా కాకుండా బెదిరింపుల వల్ల దీపిక అలా చెప్పి వుంటే మాత్రం భర్తపై కిడ్నాప్ కేసు పెట్టే అవకాశం వుంది.

విచారణను పోలీసులు వీడియో రికార్డింగ్ చేస్తున్నారు. అమ్మాయి తరపున ఇద్దరు సోదరులు కౌన్సెలింగ్‌కు హాజరయ్యారు. 2016లో దీపికను అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ఈ సమయంలో అతను మతం మార్చుకున్నాడు.

ఆమె కోసం ఇద్దరు ఓ కారును సైతం కొనుగోలు చేశాడు. వీరిద్దరూ కలిసి ఆదివారం సాయంత్రం ఆ కారులోనే వెళ్లినట్లుగా పోలీసులు నిర్ధారించారు. పెళ్లైన తర్వాత దీపిక నెల రోజులకే విడిపోయారు. దీంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు.

శనివారం నాడు విడాకుల కేసు విషయమై కోర్టుకు హాజరైన మరునాడు దీపిక కిడ్నాప్ కు గురైందని దీపిక కుటుంబసభ్యులు ఫిర్యాదు చేశారు. కాగా, దీపిక, అఖిల్ లు కలిసి ఉన్నట్టుగా తమకు సమాచారం అందిందని మంగళవారం ఉన్నతాధికారులు వెల్లడించారు. 

PREV
click me!

Recommended Stories

Kavitha Comments: అలా చేస్తేనే మహిళలల రిజర్వేషన్ బిల్ వచ్చే ఆస్కారం | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లుపై BJP Bandaru Vijayalakshmi Reaction | Telangana | Asianet News Telugu