టీడీపీతో పొత్తు: తెలంగాణ రాములమ్మ అనుమానాలు

By pratap reddyFirst Published Nov 5, 2018, 7:15 AM IST
Highlights

తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపితో సీట్ల సర్దుబాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు అనుకూలంగా జరుగుతోందనే అనుమానాలు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది.

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో పొత్తు విషయంలో కాంగ్రెసు నాయకురాలు, సినీ నటి విజయశాంతి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టీడీపితో సీట్ల సర్దుబాటు తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్)కు అనుకూలంగా జరుగుతోందనే అనుమానాలు ఆమె మాటల్లో వ్యక్తమవుతోంది.

తెలంగాణ రాష్ట్ర ఎన్నికలకు సంబంధించి ప్రజా కూటమిలో కాంగ్రెస్‌ నాయకులకు ఆమోదయోగ్యంగా సీట్ల సర్దుబాటు ఉండాలని, ఆ సర్దుబాటు టీఆర్ఎస్ నాయకులు కోరుకునే విధంగా ఉండకూడదని ఆమె అన్నారు.  

శేరిలింగంపల్లి సీటుపై గాంధీభవన్‌లో ఆదివారం ఉదయం జరిగిన పరిణామాలు తనలో కలిగిన ఆ విధమైన అనుమానాలను బలపరుస్తున్నాయని ఆమె అన్నారు. మహాకూటమిలో భాగస్వామిగా ఉన్న తెలుగుదేశం పార్టీ తన ఉనికి చాటుకోవడానికి మాత్రమే కాకుండా టీఆర్‌ఎస్‌ను ఓడించడం కూడా బాధ్యతగా భావించాలని రాములమ్మ అన్నారు.

తెలుగుదేశం పార్టీతో కాంగ్రెసు పొత్తును మొదటి నుంచి విజయశాంతి వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. 

సంబంధిత వార్త

కాంగ్రెస్, టీడీపీ పొత్తు: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

click me!