రేవంత్, మల్లారెడ్డి వివాదం... తెలంగాణ ఇంకెంత నవ్వులపాలో: విజయశాంతి సెటైర్లు

By Arun Kumar PFirst Published Aug 27, 2021, 4:18 PM IST
Highlights

టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి, మంత్రి మల్లారెడ్డి వివాదంపై స్పందిస్తూ మాజీ ఎంపీ విజయశాంతి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

హైదరాబాద్: తెలంగాణ పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి సవాల్, కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ప్రతి సవాళ్లు తెలంగాణలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచాయి. అయితే వీరిద్దరు వివాదంపై బిజెపి నాయకురాలు, మాజీ ఎంపీ విజయశాంతి సోషల్ మీడియా వేదికన స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

''పీసీసీ అధ్యక్షులు, టీఆర్ఎస్ మంత్రికి మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్ళ గురించి మల్కాజిగిరి పార్లమెంట్‌తో పాటు మేడ్చల్ అసెంబ్లీ ప్రజలు కూడా ఎంతో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. మాట్లాడిన భాష, పదజాలం ఎంత ప్రజాస్వామ్యయుతంగా ఉన్నదో అన్న చర్చ ఒకటైతే.... ఆ రాజీనామాలు జరిగి ఉపఎన్నికలు వస్తే తమకు ఈ టీఆర్ఎస్ ముఖ్యమంత్రి ఏదో వరాలు అవసరార్థం తప్పనిసరై ఇవ్వచ్చేమో అనే ఆశాభావంతో ఉన్నట్లు తెలుస్తోంది'' అన్నారు. 

read more  రేపే రాజీనామా చేస్తా, నువ్వు రెడీయా: ప్రెస్‌మీట్‌లోనే తొడగొట్టి రేవంత్‌కు సవాల్ విసిరిన మంత్రి మల్లారెడ్డి

''ఎన్నికల అవసరం లేకుంటే కేసీఆర్ గారు ప్రజల ముఖం కూడా చూడరన్న బలమైన నమ్మకం తెలంగాణ సమాజంలో ఏర్పడి ఉండటం ఇందుకు కారణం కావచ్చు. ఇంకా తెలంగాణలో ప్రజాప్రతినిధులను రాజీనామాలకై అనేక నియోజకవర్గాలలో ప్రజలు డిమాండ్ చేస్తున్నట్లు వార్తలు వస్తూనే ఉన్నాయి. రాజీనామాల కోసం, ఉపఎన్నికల కోసం ఎదురు చూడవలసిన పరిస్థితులకు ప్రజలను తీసుకెళ్ళిన ఈ అప్పుల, ఆస్తుల అమ్మకాల సీఎం గారు భవిష్యత్తులో తెలంగాణను ఇంకెంత నవ్వులపాలు చేస్తారో అన్న ఆందోళన అందరిలోనూ ఏర్పడుతున్నది'' అని విజయశాంతి పేర్కొన్నారు. 

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం మూడు చింతలపల్లి సభలో మంత్రి మల్లారెడ్డి అవీనితిపరుడంటూ టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలకు మరింత ఘాటుగా స్పందించారు మల్లారెడ్డి.  తొడగిట్టి మరీ తన అవినీతిని నిరూపించాలని సవాల్ విసిరారు. ఇలా రేవంత్, మల్లారెడ్డి మధ్య కౌంటర్ ఎన్కౌంటర్ సాగింది. అయితే వీరి మాటలు ప్రజాస్వామ్యానికి అంత మంచిది కాదని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ నేపథ్యంలోనే విజయశాంతి ఈ వివాదంపై స్పందించారు.    
 

click me!