నిన్న నేను, నేడు హరీష్: విజయశాంతి సంచలన వ్యాఖ్యలు

By telugu teamFirst Published 21, Feb 2019, 7:08 AM IST
Highlights

దొరల వారసత్వ పాలన తీరు కూడా నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనే ఇంతేనని విజయశాంతి అన్నారు. నమ్మిన వారిని తడి గుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. కాలం మారినా టీఆర్ఎస్ నాయకత్వ వైఖరి మారలేదని ఆమె అన్నారు.

హైదరాబాద్: తెలంగాణ మంత్రివర్గ కూర్పుపై తెలంగాణ కాంగ్రెసు నాయకురాలు విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు. మొన్న ఆలె నరేంద్ర, నిన్న నేను, నేడు తన్నీరు హరీష్ రావు అని ఆమె అన్నారు. టీఆర్ఎస్‌లో రెండో స్ధానంలో ఉన్న వారి పరిస్ధితి ఎప్పటికీ ఇంతేనని ఆమె అన్నారు. 

దొరల వారసత్వ పాలన తీరు కూడా నాడు, నేడు, రేపు.. ఎప్పుడైనే ఇంతేనని విజయశాంతి అన్నారు. నమ్మిన వారిని తడి గుడ్డతో గొంతు కోయడం టీఆర్ఎస్ నాయకత్వ నైజమనే విషయం మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. కాలం మారినా టీఆర్ఎస్ నాయకత్వ వైఖరి మారలేదని ఆమె అన్నారు.
 
హరీష్ రావును కేసీఆర్ మంత్రివర్గంలోకి తీసుకోకపోవడంపై విజయశాంతి ఆ వ్యాఖ్యలు చేశారు. ఇటు ఫేస్‌బుక్‌లోనూ, అటు ట్విట్టర్‌లోనూ ఆమె వ్యాఖ్యలను పోస్టు చేశారు.

Last Updated 21, Feb 2019, 7:08 AM IST