మాజీ ఆబ్కారీ మంత్రితో తాజా మంత్రి భేటీ....

Published : Feb 20, 2019, 09:05 PM IST
మాజీ ఆబ్కారీ మంత్రితో తాజా మంత్రి భేటీ....

సారాంశం

ఇటీవలే తెలంగాణ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన శ్రీనివాస్ గౌడ్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆబ్కారీ, క్రీడల శాఖను అప్పగించిన విషయం తెలిసిందే. అయితే శాఖలపై స్పష్టత వచ్చిన వెంటనే శ్రీనివాస్ గౌడ్ తన పనిని ప్రారంభించారు. గత ప్రభుత్వంలో ఈ శాఖల మంత్రిగా పనిచేసిన  సికింద్రాబాద్ ఎమ్మెల్యే తీగుల్ల పద్మారావు గౌడ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా  మాజీ మంత్రితో ఆబ్కారీ, క్రీడా శాఖలకు సంబంధించిన విషయాలు, ఎదురయ్యే సవాళ్ల గురించి తాజా మంత్రి చర్చించారు.    

ఈ సందర్భంగా పద్మారావు గౌడ్ మాట్లాడుతూ...గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలకు, వివాదాలకు తావులేకుండా ఆబ్కారీ శాఖను నిర్వహించామన్నారు. వినూత్నమైన పథకాలు, చర్యలతో ఆబ్కారీ శాఖ ఆదాయాన్ని గణనీయంగా పెంచామని...అందుకు ముఖ్యమంత్రి అన్నివేళలా, అన్నివిధాలుగా సహకరించారన్నారు.  

కొత్తగా అబ్కారి శాఖ బాధ్యతలు చేపట్టిన శ్రీనివాస గౌడ్ కూడా ఇదే విధంగా సమర్ధవంతంగా పనిచేస్తాడన్న నమ్మకం తనకుందని పద్మారావు గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ ను పద్మారావు గౌడ్  అభినందించారు.
 
PREV
click me!

Recommended Stories

Hyderabad: న్యూ ఇయర్ వేళ మాదక ద్రవ్యాల మత్తు వదిలించే పాట.. ఆవిష్కరించిన వీసీ సజ్జనార్!
Kalvakuntla Kavitha: సీఎం రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కల్వకుంట్ల కవిత | Asianet News Telugu