తెలంగాణ బీజేపీ కార్యాలయంలో రాములమ్మ సందడి

By Siva KodatiFirst Published Dec 10, 2020, 4:31 PM IST
Highlights

కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత తొలిసారి హైదరాబాద్‌లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి విజయశాంతి చేరుకున్నారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ సమక్షంలో ఆమె కాషాయ కండువా కప్పుకున్నారు.

ఈ సందర్భంగా ఆమెకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అరుణ్ సింగ్. ఈ సందర్భంగా తన రాజకీయ జీవితం గురించి మాట్లాడుతూ విజయశాంతి పలు వ్యాఖ్యలు చేశారు. 1998లో బీజేపీలో తాను చేరానని గుర్తు చేశారు.

అయితే కొందరు తెలంగాణకు వ్యతిరేకంగా ఉన్నారని 2005లో ఆ పార్టీ నుంచి బయటికి వచ్చాను. ఆ తర్వాత తల్లి తెలంగాణ పార్టీ స్థాపించి అనేక సమస్యలపై పోరాటం చేశానన్నారు.

అప్పుడు తన పార్టీనీ టీఆర్‌ఎస్‌లో విలీనం చేయమని కేసీఆర్ అడిగారన్నారు విజయశాంతి. నిజానికి 1998లోనే తాను తెలంగాణ పోరాటం మొదలు పెట్టానన్నారు రాములమ్మ. టీఆర్‌ఎస్‌ కంటే ముందు తెలంగాణ ఉద్యమంలో భాగమయ్యానని గుర్తు చేశారు.

click me!