విజయ దశమి: కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ఆయుధ పూజ

Published : Oct 08, 2019, 09:12 PM ISTUpdated : Oct 08, 2019, 09:20 PM IST
విజయ దశమి: కుటుంబ సభ్యులతో కలిసి కేసీఆర్ ఆయుధ పూజ

సారాంశం

విజయదశమి పర్వదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ తన అధికారిక నివాసం ప్రగతిభవన్ లో ఆయుధ పూజ చేశారు. పాలపిట్టను దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆయన పూజలు చేశారు.

హైదరాబాద్: విజయ దశమి పర్వదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు తన అధికారిక నివాసంలో వాహనపూజ, ఆయుధ పూజ ఘనంగా నిర్వహించారు. 

దసరా పండుగ నాడు మంగళవారం ఉదయం ప్రగతి భవన్ నివాసంలోని నల్ల పోచమ్మ దేవాలయంలో కుటుంబ సమేతంగా పూజలు నిర్వహించారు. 

వాహన పూజ చేశారు. నివాసంలో ఆయుధ పూజ  అనంతరం పాలపిట్ట దర్శనం చేసుకున్నారు. ఉద్యోగులకు, వారి కుటుంబ సభ్యులకు  ముఖ్యమంత్రి శుభాకాంక్షలు తెలిపారు.

ఈ పూజా కార్యక్రమంలో సతీమణి శోభాచంద్రశేఖర్ రావు, కుమారుడు కె.తారక రామారావు, కోడలు శైలిమ,మనుమడు హిమాన్షు, కూతురు కవిత,  అల్లుడు అనిల్ కుమార్ మనుమళ్లు మనుమరాండ్లు ఇతర కుటుంబ సభ్యులు కార్యాలయ అధికారులు, సిబ్బంది తదిరలు పాల్గొన్నారు.

PREV
click me!

Recommended Stories

CM Revanth Reddy Speech: క్రిస్మస్ వేడుకల్లో సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్ | Asianet News Telugu
Ration Card: ఇక‌ రేషన్ షాప్‌కి వెళ్లాల్సిన ప‌నిలేదు.. అందుబాటులోకి కొత్త మొబైల్ యాప్