యూనియన్ నేతల ఉచ్చులో పడొద్దు: ఆర్టీసీ కార్మికులకు మంత్రి నిరంజన్ ‌రెడ్డి సూచన

By Siva KodatiFirst Published Oct 8, 2019, 1:22 PM IST
Highlights

ఆర్టీసీ కార్మికులు కూర్చున్న కొమ్మనే నరుక్కుంటున్నారన్నారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఆర్టీసీ కార్మిక నేతలు రహస్య ఎజెండాతో పనిచేస్తున్నారని.. కార్మికులు యూనియన్ నేతల ఉచ్చులో పడొద్దని ఆయన హితవుపలికారు.

కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఈ డిమాండ్లను అమలు చేస్తారా అని మంత్రి ప్రశ్నించారు. ఆచరణ సాధ్యం కాని హామీలను అమలు చేయాలనడం అవివేకమని నిరంజన్ రెడ్డి ఎద్దేవా చేశారు.

కాగా.. ఆర్టీసీ కార్మికులు తప్పు తెలుసుకుని ప్రభుత్వానికి సరెండర్ అవ్వాలన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. యూనియన్ నేతల మాటలను కార్మికులు నమ్మొద్దని ఆయన సూచించారు.

పండుగ వేళ ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూశారని కాంగ్రెస్, బీజేపీ వైఖరే ఆర్టీసీ పరిస్థితికి కారణమని ఎర్రబెల్లి స్పష్టం చేశారు. సమ్మెకు మద్ధతివ్వడానికి కాంగ్రెస్, బీజేపీలకు సిగ్గుండాలని ఆయన మండిపడ్డారు. కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆర్టీసీని విలీనం చేశారా అని ఎర్రబెల్లి ప్రశ్నించారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోనే ఆర్టీసీ ఉద్యోగులకు అత్యధిక జీతాలు చెల్లిస్తున్నామని మంత్రి గుర్తు చేశారు. యూనియన్ నాయకులను కార్మికులు నిలదీయాలని దయాకర్ రావు సూచించారు. 

click me!