కాంగ్రెస్ కార్యకలాపాలకు దూరం: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విహెచ్ భేటీ

By telugu teamFirst Published Nov 6, 2021, 1:10 PM IST
Highlights

హూజురాబాద్ ఉప ఎన్నికల్లో తమ కాంగ్రెసు ఈటల రాజేందర్ కు మద్దతు ఇచ్చిందని పరోక్ష వ్యాఖ్య చేసిన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో విహెచ్ సమావేశమయ్యారు. బిజెపికి రేవంత్ రెడ్డి సహకరించారనే రీతిలో ఆయన వ్యాఖ్యానించారు.

హైదరాబాద్: అంసతృప్తితో ఉన్న భువనగిరి పార్లమెంటు సభ్యుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని బుజ్జగించేందుకు తెలంగాణ కాంగ్రెసు సీనియర్ నేత వి హనుమంతరావు రంగంలోకి దిగారు. Komatireddy Venkat Reddyతో విహెచ్ శనివారం కాంగ్రెసు లెజిస్లేటర్ పార్టీ (సీఎల్పీ) కార్యాలయంలో సమావేశమయ్యారు. కోమటిరెడ్డి వెంకట రెడ్డి కాంగ్రెసు కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. Telangana PCC అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డిని నియమించడంతో ఆయన అసంతృప్తికి గురయ్యారు.

ఇటీవల తెలంగాణ కాంగ్రెసు పార్టీ కార్యాలయంలో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి కూడా హాజరు కాలేదు. హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు పార్టీ అభ్యర్థి బల్మూరి వెంకట్ అత్యంత నిరాశాజనకమైన ఫలితాన్ని సాధించడంపై ఈ సమావేశం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెసు అతి తక్కువ ఓట్లు సాధించడంపై కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. 

Also Read: సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుంది: హుజూరాబాద్ ఫలితంపై రేవంత్ రెడ్డి

పొలిటికల్ కమిటీ అఫైర్స్ సమావేశానికి హాజరై ఆయన తన అభిప్రాయాలను వెల్లడిస్తారని భావించారు. కానీ ఆయన హాజరు కాలేదు. దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో మాట్లాడే బాధ్యతను కాంగ్రెసు అధిష్టానం VHకు అప్పగించింది. ఇందులో భాగంగానే ఆయన కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో సమావేశమయ్యారు. ఎంపీ, ఎమ్మెల్యే పార్టీకి దూరంగా ఉండడం మంచిది కాదని విహెచ్ అన్నారు. అందరం కలిసి పనిచేద్దామని ఆయన కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సూచించారు. హుజూరాబాద్ ఫలితంపై సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. ఆయన కూడా పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి హాజరు కాలేదు. ఈ ఇద్దరిని ఉద్దేశించి విహెచ్ ఆ విధమైన వ్యాఖ్య చేశారు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ తమ నాయకులని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. ఎవరూ చేయని ధైర్యం సోనియా గాంధీ చేశారని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చే విషయంలో సోనియా గాంధీ ఆ ధైర్యం ప్రదర్శించారని ఆయన అన్నారు. సోనియా గాంధీని దెయ్యం అన్నవాళ్లు కూడా తమ పార్టీలో ఉన్నారని ఆయన రేవంత్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. పార్టీకి ప్రాణం ఇచ్చేందుకు సిద్ధపడే నాయకుడు విహెచ్ అని, విహెచ్ అంటే తనకు అభిమానం ఉందని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నికల ప్రచారానికి పెద్ద పెద్ద నాయకులు వెళ్లారని, తాము వెళ్లడం వల్ల ప్రయోజనం ఏం ఉంటుందని ఆయన అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెసు తుడిచిపెట్టుకుపోయిన స్థితిలో కూడా బద్వేలు ఉప ఎన్నికలో కాంగ్రెసుకు 6 వేల ఓట్లు వస్తే హుజూరాబాద్ ఉప ఎన్నికలో 3 వేలు మాత్రమే వచ్చాయని ఆయన అన్నారు. 

Huzurabad bypollలో కాంగ్రెసు అభ్యర్థి బల్మూరి వెంకట్ కు 2 వేలకు పైగా మాత్రమే ఓట్లు వచ్చాయి.  దీంతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అసంతృప్తితో కూడిన వ్యాఖ్యలు చేశఆరు. శత్రువుకు శత్రువు మిత్రుడని, అందుేక ఈ ఎన్నికల్లో కేసీఆర్ శత్రువైన ఈటల రాజేందర్ కు తాము మద్దతు ఇవ్వక తప్పలేదని ఆయన వ్యాఖ్యానించారు.  తాము గట్టిగా పోరాడి ఉంటే ఓట్లు చీలిపోయి ఉండేవని, అలా జరిగితే టీఆర్ఎస్ లాభపడేదని అన్నారు. 

Also Read: Huzurabad bypoll result 2021: సీనియర్ల అస్త్రం ఇదే, రేవంత్ రెడ్డికి చిక్కులు

ఆ రకమైన వ్యాఖ్యల ద్వారా కాంగ్రెసు పార్టీ Eatela rajenderకు మద్తతు ఇచ్చిందనే విషయాన్ని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పరోక్షంగా చెప్పారు. ఆ వ్యాఖ్య ద్వారా కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని వ్యతిరేకించినట్లు భావిస్తున్నారు. అయితే, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెసు వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ అన్నారు. తాము బిజెపికి మద్దతు ఇచ్చే ప్రసక్తి లేదని ఆయన చెప్పారు హుజూరాబాద్ లో విజయం బిజెపిది కాదని, వ్యక్తితంగా ఈటల రాజేందర్ దని ఆయన అన్నారు. మహేష్ గౌడ్ రేవంత్ రెడ్డికి సన్నిహితుడనే అభిప్రాయం ఉంది. 

కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా స్పందించారు. కాంగ్రెసులో సీనియర్లకు స్వేచ్ఛ ఎక్కువ ఉంటుందని ఆయన వ్యాఖ్యానించారు. 

click me!