భర్త స్నేహితుడి వేధింపులు భరించలేక వివాహిత ఆత్మహత్య.. అవమానం భరించలేక అతను కూడా..

By SumaBala Bukka  |  First Published Mar 8, 2022, 6:37 AM IST

కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన జరిగింది. భర్త స్నేహితుడి వేధింపులు భరించలేక.. ఇంట్లో చెబితే ఏం అంటారో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక ఓ వివాహిత మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకుంది. ఇద్దరు చిన్నారుల్ని అనాథల్ని చేసింది. 


దండేపల్లి : తన భర్త frined harrasement భరించలేక దండేపల్లి మండలం ముత్యంపేట గ్రామానికి చెందిన married woman మౌనిక (24) ఈ నెల 5న పురుగుల మందు తాగగా.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ ఐ సాంబమూర్తి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. అత్త, భర్త, తల్లి కలిసి ఇంటి ముందు మాట్లాడుకుంటుండగా మౌనిక పురుగుమందు తాగి.. వాంతులు చేసుకుంటూ ఇంట్లో నుంచి బయటకు వచ్చింది. ఇది గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే లక్సెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.  

ఆమె భర్త స్నేహితుడు, అదే గ్రామానికి చెందిన మోట పలుకుల ప్రశాంత్ (28) ఫోన్లో మానసికంగా వేధిస్తుండటంతో.. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మనస్థాపంతో పురుగులమందు తాగిందన్నారు. ప్రాథమిక చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో కరీంనగర్ ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది అన్నారు. మౌనికకు ఇద్దరు కూతుర్లు ఉన్నారు. మృతురాలి తల్లి సుగుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నట్లు పేర్కొన్నారు  కాగా,  స్నేహితుడి భార్యను వేధించడం.. ఆమె ఆత్మహత్యకు పాల్పడడంతో.. అవమానంగా భావించిన  మోటపల్కుల ప్రశాంత్ (28) సోమవారం రామగుండం దగ్గర దగ్గర రైలు పట్టాలపై పడి ఆత్మహత్య చేసుకున్నట్లు గ్రామస్తులు తెలిపారు. ప్రశాంత్ కు ఏడాది పాప ఉంది.

Latest Videos

undefined

ఇదిలా ఉండగా, సోమవారం శ్రీకాకుళంలో భార్యభర్తల మధ్య జరిగిన తగాదా మూడు నిండు ప్రాణాలను బలిగొంది. Husband harassment భరించలేక ఓ మహిళ ఉరివేసుకుని suicideకి పాల్పడింది. తాను చనిపోతే Children ఏమైపోతారో అనే ఆందోళనతో వారిద్దరిని కూడా చంపేసింది. ఈ ఘటన Srikakulam నగరం దమ్మలవీధిలో నివాసం ఉంటున్న ధనలక్ష్మి (27)కి గార మండలం పేర్లవానిపేటకు చెందిన లక్ష్మీనారాయణతో పన్నెండేళ్ళ కిందట వివాహమయ్యింది. అయిదేళ్ల పాటు కాపురం చక్కగానే సాగింది. ఆ తర్వాత వేధింపులు ఎక్కువ కావడంతో ధనలక్ష్మి ఇద్దరు పిల్లలు సోనియా (11), యశ్వంత్ (9)తో కలిసి ఏడేళ్ల కిందట తండ్రి మైలపల్లి ఎర్రయ్య ఇంటికి వచ్చేసింది.

కాకినాడలో షిప్ లో పనిచేసే లక్ష్మీనారాయణ అప్పుడప్పుడు వచ్చి వీరిని చూసి వెళుతూ వుండేవాడు. అప్పుడు కూడా ఇద్దరి మధ్య తగాదాలు జరుగుతుండేవి. ఏడాది నుంచి ఒక్కసారి కూడా భార్య, పిల్లలను చూసేందుకు రాలేదు. ఆదివారంనాడు ధనలక్ష్మి భర్తతో ఫోన్లో మాట్లాడింది. వారి మధ్య ఏం సంభాషణ జరిగిందో.. ఏమో కానీ  ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇతర పిల్లలతో పాటు తాను ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది.

ధనలక్ష్మి తండ్రి మైలపల్లి ఎర్రయ్య ఆర్టీసీ డ్రైవర్ గా పని చేసి ఉద్యోగ విరమణ పొందాడు. ఇంట్లో ఖాళీగా ఉండలేక ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ గా వెళ్తున్నాడు. ఆయన భార్య సీతమ్మ రోజు ఇంట్లోనే ఉంటూ పిల్లలను చూసుకునేది. ఆదివారం ఆమె వత్సవలస జాతరకు వెళ్లడంతో ఇంట్లో ఎవరూ లేరు ఈ సమయంలోనే ధనలక్ష్మి అఘాయిత్యానికి పాల్పడింది.. భర్తను చూడడానికి రావట్లేదని పిల్లలతో సహా ఏదో చేసుకుంటానని ధనలక్ష్మి అంటూ ఉండేదని, మేము నీకు అండగా ఉంటాం.. అలాంటి ఆలోచన పెట్టుకోవద్దు.. అంటూ ఎంత చెప్పినా వినలేదని ఎర్రయ్య బోరున విలపించారు.  

ముగ్గురు వేర్వేరు గదుల్లో ఉరి వేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.  క్లూస్ టీం వేలిముద్రలను సేకరించింది. శ్రీకాకుళం డి.ఎస్.పి  మహేంద్ర, ఒకటో పట్టణ సీఐ అంబేద్కర్, ఎస్ఐ విజయ్ కుమార్, ప్రవళిక ఘటనా స్థలాన్ని పరిశీలించారు. యర్రయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. 

click me!