
హైదరాబాద్ : భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ జన్మదినం సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.
తలసీమియా బాధితుల కోసం నిర్వహించిన ఈ రక్తదాన శిబిరంలో 2,425మంది రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ను ప్రశంసిస్తూ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ప్రశంస పత్రాన్ని పంపించారు.