ఒక్క వాహనంపై 61 చలానాలు.. సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

Published : Jun 11, 2019, 10:48 AM IST
ఒక్క వాహనంపై 61 చలానాలు.. సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు

సారాంశం

కేవలం ఒకే ఒక్క ద్విచక్ర వాహనంపై 61 చలానాలు నమోదయ్యాయి. కాగా... ఆ వాహనాన్ని సోమవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది.

కేవలం ఒకే ఒక్క ద్విచక్ర వాహనంపై 61 చలానాలు నమోదయ్యాయి. కాగా... ఆ వాహనాన్ని సోమవారం ట్రాఫిక్ పోలీసులు పట్టుకున్నారు. ఈ సంఘటన హైదరాబాద్ లో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే.... ఆసిఫ్ నగర్ పోలీసులు సోమవారం ట్రాఫిక్ విధుల్లో భాగంగా ఓ వాహనాన్ని అడ్డుకున్నారు. కాగా.. అతని బైక్ నెంబర్ ఆధారంగా పరిశీలిస్తే.... అతని వాహనంపై 61 పెండింగ్ చలానాలు ఉన్నట్లు గుర్తించారు.

వాటిల్లో 59 వాహనాలు హెల్మెట్ లేకుండా వాహనం నడిపినవే కావడం గమనార్హం. వీటి మొత్తం కలిసి ఆ వ్యక్తి రూ.8,515 జరిమానా చెల్లించాల్సి ఉంది. వాటిని చెల్లించకపోవడంతో... అతని వాహనాన్ని సీజ్ చేసినట్లు అధికారులు చెప్పారు. అదేవిధంగా ట్రాఫిక్ నిబంధనలను పాటించని దాదాపు 16 ఆటోలను కూడా సీజ్ చేసినట్లు వారు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఏపీ, తెలంగాణలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు
Onion and Sugar Prices: తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి చక్కెర మంట.. అసలు ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?