ఖైదీలే రేడియో జాకీలు: తెలంగాణ ప్రభుత్వం సరికొత్త ప్రయోగం

By Nagaraju penumalaFirst Published Jun 11, 2019, 9:20 AM IST
Highlights

ఖైదీల్లో ఆత్మన్యూనతా భావాన్ని పోగొట్టి నూతనోత్సాహాన్ని నింపేందుకు ఎఫ్‌ఎం ఎంతగానో తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు సంగారెడ్డి జిల్లా సబ్ జైళ్ల అధికారి వెంకటేశ్వర్లుతోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎఫ్‌ఎం నిర్వహణ కోసం ఐదుగురు ఖైదీలకు జాకీలుగా శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. 

సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లా జైలులో రేడియో ఎఫ్ఎం హల్ చల్ చేస్తోంది. వినండి వినండి ఉల్లాసంగా అంటూ ఖైదీలే రేడియో జాకీలుగా మారుతూ మిగిలిన వారిని ఉత్సాహపరుస్తున్నారు. సోమవారం ఖైదీల కోసం ఎఫ్ఎం రేడియోను ప్రారంభించారు సంగారెడ్డి జిల్లా సబ్ జైళ్ల అధికారి వెంకటేశ్వర్లు. 

ఇకపోతే సంగారెడ్డి జిల్లా జైలులో ఏర్పాటు చేసిన ఎఫ్ఎంలో ఖైదీలే రేడియో జాకీలుగా వ్యవహరిస్తూ అందర్నీ ఉత్సాహపరుస్తున్నారు. ఉదయం భక్తిగీతాలతో ప్రారంభం కానున్న ఈ రేడియో ఎఫ్ఎం, మధ్యలో వార్తలు, ప్రముఖ వ్యక్తుల జీవిత చరిత్రలు, ఇతర సమాచారాన్ని అందించనున్నారు.

click me!