ఉచితంగానే రైతులకు కాళేశ్వరం నీళ్లు, త్వరలో దేశం ఆశ్చర్యపడే విషయం చెబుతా: కేసీఆర్

By narsimha lodeFirst Published May 29, 2020, 2:38 PM IST
Highlights

నయా పైసా లేకుండా ఉచితంగా విద్యత్ ను అందిస్తున్నాం,  అదే తరహాలోనే కాళేశ్వరం నీళ్లు కూడ ఉచితంగానే రైతులకు అందిస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన స్పష్టం చేశారు.  కాళేశ్వరం ఆయకట్టు రైతుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తీరువా వసూలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు.

మెదక్: నయా పైసా లేకుండా ఉచితంగా విద్యత్ ను అందిస్తున్నాం,  అదే తరహాలోనే కాళేశ్వరం నీళ్లు కూడ ఉచితంగానే రైతులకు అందిస్తామని  తెలంగాణ సీఎం కేసీఆర్ ఆయన స్పష్టం చేశారు.  కాళేశ్వరం ఆయకట్టు రైతుల నుండి ఎట్టి పరిస్థితుల్లోనూ నీటి తీరువా వసూలు చేయబోమని ఆయన హామీ ఇచ్చారు.

శుక్రవారం నాడు తెలంగాణ సీఎం కేసీఆర్ కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు.తెలంగాణ రైతులకు త్వరలోనే తీపి కబురు చెబుతానన్పారు. దేశం ఆశ్చర్యపడే విషయాన్ని చెబుతానని ఆయన తేల్చి చెప్పారు. 

లక్షలాది ఎకరాలకు నీళ్లు అందించే అద్భుతమైన ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని ఆయన చెప్పారు.తెలంగాణ కల సంపూర్ణంగా నెరవేరిందన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టు కోసం భూములు కోల్పోయిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు.

గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ పట్టణాన్ని రూపొందించనున్నామన్నారు.నిర్వాసిత గ్రామాల ప్రజలకు సిద్దిపేట జిల్లాలో ఏర్పాటు చేయనున్న పుడ్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీల్లో ఉపాధి కల్పిస్తామన్నారు.

165 టీఎంసీల కొత్త రిజర్వాయర్లు ఎవరికీ సాధ్యం కాదన్నారు.  ఏ ప్రభుత్వం కూడ ఇంత త్వరగా  ప్రాజెక్టులను పూర్తి చేయలేదన్నారు.లక్ష కోట్ల పంటను తెలంగాణ రైతులు ఏడాదిలో పండించనున్నారని సీఎం విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. 

ఈ ప్రాజెక్టు కోసం 4 వేల మెగావాట్ల విద్యుత్ కోసం ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేసుకొన్నామన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మిస్తున్నట్టుగా ఆయన తెలిపారు.530 టీఎంసీ నీటిని ఉపయోగించుకొనేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాజెక్టులు నిర్మిస్తుందన్నారు.

also read:88 నుండి 618 మీటర్ల ఎత్తుకు గోదావరి: కొండ పోచమ్మ రిజర్వాయర్ విశేషాలివీ...

నియంత్రిత పద్దతిలో వ్యవసాయ సాగు చేస్తామన్నారు. కానీ, ఇది నియంతృత్వ సాగు కాదన్నారు. వేలాది గ్రామాలు ముఖ్యమంత్రి బాటే తమ బాటే అంటున్నాయన్నారు.గౌరవల్లి, గండిపల్లి ప్రాజెక్టులు  కూడ త్వరలోనే పూర్తి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. తెలంగాణ రైతాంగం దేశానికి ఆదర్శంగా మారనుందన్నారు. మిషన్ భగీరథతో తెలంగాణలో  ప్రతి ఇంటికి మంచి నీళ్లు ఇస్తున్నామన్నారు.


 

click me!